నల్లగొండ జిల్లా: తంబాకు (ఖైనీ) ఇవ్వకపోవడంతో యువకుడిని హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో చోటుచేసుకుంది.శనివారం నిందితున్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన మిర్యాలగూడ డిఎస్పి వెంకటగిరి హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
డిఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం… నిందితుడు ఓం ప్రకాష్ గుప్తా,మృతుడు రఘునందన్ రామ్ ఇరువురు మద్యానికి బాగా అలవాటు పడి ఆదివారం కూలీ డబ్బులు రాగానే ఇద్దరు కలిసి మద్యం తాగుతూ ఉండేవారు.ఈనెల 23వ తేదీన ఇద్దరు వారి వారి కూలీ డబ్బులు తీసుకొని బాగా మద్యం తాగి డ్యూటీ కి వెళ్లకుండా తిరుగుతున్నారు.
25వ తేదీన నిందితుడు, మృతుడు డ్యూటీకి వెళ్లకుండా మద్యం తాగడానికి గాను ప్రహరీ గోడ బయట మద్యం దుకాణంలో మద్యం తాగారు.ప్లాంట్ కు వెళుతుండగా నిందితుడు ఓం ప్రకాష్ గుప్తా మృతుడు రఘునందన్ రామ్ ని ఖైనీ ఇవ్వమని అడగగా మృతుడు ఇవ్వకుండా నానా బూతులు తిట్టి ప్లాంట్ వైపు వెళుతున్నాడు.
మద్యం మత్తులో ఉన్న నిందితుడు అతడిని వెనుక నుండి రాయితో తలపై విసిరి కొట్టాడు.దాంతో అతను కింద పడి లేచి పరిగెత్తుటకు ప్రయత్నిస్తుండగా మళ్లీ తలపై వెనుక భాగంలో బండరాలతో మోది హత్య చేశాడు.
యాదాద్రి పవర్ ప్లాంట్ లోని నిర్మానుష్య ప్రదేశంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రఘునందన్ రామ్ (25) అనే కార్పెంటర్ ఈనెల 26వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో తలపై మోది హత్య చేసినట్లుగా వచ్చిన ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.మిర్యాలగూడ సర్కిల్ టీం పర్యవేక్షణలో సీసీ కెమెరా, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అరెస్టు చేసినట్లు,ఈ హత్య కేసులో బీహార్ రాష్ట్రానికి చెందిన ఓం ప్రకాష్ గుప్తా ని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ కేసును అత్యంత చాకచక్యంగా చేధించినందుకు మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ,ఎస్ఐలు రవికుమార్,నరసింహులు, హరిబాబు,నరేష్,సిబ్బంది హెడ్ కానిస్టేబుల్,ఆఫీసర్స్ అహ్మద్,గోపయ్య, రాజారాం,సతీష్,తోట భాస్కర్,వెంకటేశ్వర్లును డిఎస్పీ అభినందించారు.