నల్గొండ జిల్లా: మునుగోడు మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ మరుగుదొడ్ల పథకానికి ప్రజాప్రతినిధులు,అధికారులు శంకుస్థాపన చేసి నెలకు గడుస్తున్నా నేటికీ మోక్షం కలగడంలేదని, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ,అధికారులు కానీ,కనీసం ఇటువైపు తొంగి చూసిన పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది బీఎస్పీ నాయకులు పోరాట ఫలితంగా మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుబండ వేశారని బీఎస్పీ నాయకుడు తీగల రమేష్ అన్నారు.
మునుగోడులో ప్రతి గురువారం జరిగే కూరగాయలు మార్కెట్ కు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వచ్చే మహిళలు పబ్లిక్ టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి తక్షణమే మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.