సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం వాయిలసింగారం-కోదాడ ప్రధాన రహదారిలో రామిరెడ్డిపాలెం మిల్లు వద్ద కల్వర్టు దెబ్బతిని నడిరోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది.శిధిలావస్థకు చేరుకున్న తర్వాత నూతన బీటి రోడ్డు నిర్మాణం కోసం 6 నెలల క్రితం పాత రోడ్లు తవ్విన కాంట్రాక్టర్ కల్వర్టుకు ఎలాంటి పనులు చేయకుండా తూతూ మంత్రంగా కంకర,డస్ట్ పరచి వదిలేశారు.
దీనిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఈ రోడ్డు వైపు రావడమే లేదు.
ఈ రహదారి మీదగా వాయిలసింగారం, వసంతపురం,త్రిపురావరం,రత్నావరం,మీట్య తండా, కొత్త గోల్ తండా,పాత గోల్ తండా వెంకట్రాంపురం తడుతర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.
వాహనాల తాకిడికి,వర్షాలకు పోసిన డస్ట్ కొట్టుకుపోయి,కంకర పైకి తేలడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.దీనికి తోడు నడి ఏ రోడ్డుపై భారీ గుంత ఉండడంతో రాత్రిపూట ప్రయాణం చేయాలంటే వణికిపోతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లనే బిటి రోడ్డు నిర్మాణం ఆలస్యం అవుతుందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నూతన కల్వర్టు నిర్మించి,బిటి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, వాహనదారులు,ప్రజలు కోరుతున్నారు.