నల్లగొండ జిల్లా:శనివారం మెదక్ జిల్లా చేగుంట మండల ఉద్యోగులు దేవసోత్ రమేష్ నాయక్,ఎర్ర శ్రీనివాస్ అనే ఇద్దరు సీఆర్పీలు కాంప్లెక్స్ లో విధులు నిర్వహించిన అనంతరం మండల విద్యా వనరుల కేంద్రానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని,విధినిర్వహణలో మరణించిన వారికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజు కోరారు.తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం రాత్రి జిల్లా సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో పెద్ద గడియారం సెంటర్ వద్ద మృతి చెందిన వారికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరారు.
చనిపోయిన ఇద్దరు సీఆర్పీలు అత్యంత కడు పేదవాళ్ళని ఒకరికి ఇద్దరు,ఇంకొకరికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారని, ఇరు కుటుంబాలకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా వెంటనే ప్రకటిస్తూ వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.గత 14-15 సంవత్సరాలుగా,విద్యా శాఖకు ఎన్నో సేవలు చేస్తూ,చాలీచాలని వేతనాలతో కుటుంబాలను ఈడుస్తున్నా,ఏళ్ల తరబడి వెట్టి చాకిరీకి గురి అవుతున్నా,సమగ్ర శిక్ష ఉద్యోగుల వెతలు ఈ ప్రజా ప్రభుత్వంలో తీరుతాయని అనుకున్నామని,అవి నెరవేరక ఎంతో మనోవేదనకు గురి అబతున్నామని వాపోయారు.
ప్రభుత్వం సమ్మె కాలంలో ఇచ్చిన మాట ప్రకారం ఎస్గ్రేషియా మరియు నాన్ ఫైనాన్షియల్ హామీలను వెంటనే అమలు పరచాలని కోరారు.ఈ కార్య్రమంలో ఎస్.భిక్షం,చరక వెంకటకృష్ణ,ఇటిక్యాల రమేష్, బొజ్జ శంకర్,లక్ష్మీ,శోభా,అజిమ్ బాబా,జహంగీర్ భాషా, ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.