నల్లగొండ జిల్లా:గుర్రంపోడ్ మండల కేంద్ర సమీపంలోని శేషిలేటి ( Seshileti )వాగుపై వందేళ్ల క్రితం నిర్మించిన పురాతన వంతెన గుంతలమయమై శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాథుడే లేడని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బ్రిడ్జికి కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో నిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉండే వంతెనపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి,వీలైతే నూతన వంతెన నిర్మించుటకు ప్రణాళికలు రూపొందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.గుర్రంపోడ్ శేషిలేటి వాగుపై పురాతన వంతెన మొత్తం గుంతలుపడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారిందని గుర్రంపోడ్ చెందిన కట్ట రాకేష్( Katta Rakesh ) అన్నారు.
గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కసారి కూడా ఈ వంతెనపై గుంతలు పూడ్చి మరమ్మత్తు చేయక శిధిలావస్థకు చేరింది.ఈ ప్రభుత్వమైనా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు.