బౌద్ధ ఆధారాల అక్షయ పాత్రగా ఫణిగిరి

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా( Suryapet District )లోని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో ఫణిగిరి గ్రామం బౌద్ధ ఆధారాలకు అక్షయ పాత్రగా పురావస్తు శాఖ అధికారులు అభివర్ణిస్తూ ఉంటారు.ఇక్కడ తవ్వే కొద్దీ కొత్త అద్భుతాలు బయట పడుతూనే ఉన్నాయి.

 Phanigiri As Akshaya Character Of Buddhist Scriptures, Suryapet District, Phanig-TeluguStop.com

బౌద్ధ భిక్షువుల కోసం గదులు,ఎన్నో శాసనాలు, నాణేలు ఇవన్నీ ఫణిగిరి గుట్ట( phanigiri gutta ) మీద దొరికాయి.పురాతన,చారిత్రక,సాంస్కృతిక ఆధారాలను తెలుసుకునేందుకు అప్పటి ఆచారాలను విశ్లేషించేందుకు పురావస్తు తవ్వకాలు బాగా ఉపయోగపడతాయి.

ఈక్రమంలోనే పురావస్తు శాస్త్రవేత్తలు నల్లగొండ జిల్లాలో జరిపిన తవ్వకాల్లో 2 వేల సంవత్సరాల నాటి నాణేలు బయటపడ్డాయి.తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్దుల కాలంలో వినియోగించినవిగా చెప్పబడుతున్న 3700 సీసపు నాణేలను వెలికి తీశారు.2015లో ఫణిగిరి గ్రామంలో జరిపిన తవ్వకాల్లో కూడా 2 వేల ఏళ్ల నాటి బౌద్ద అవశేషాలను పురావస్తు శాఖ సేకరించింది.ఫణిగిరి క్రీ.పూ.3 వ శతాబ్దం నుండి క్రీ.శ.3వ శతాబ్ధం మధ్య కాలంలో బౌద్ద జ్ణానానికి సంబంధించిన ప్రధాన ప్రాంతంగా వర్ధిల్లినట్లు చెబుతున్నారు.అక్కడి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ద స్తూపం, విహారం,చైత్యాలు వంటివి విస్తరించి ఉన్నాయి.కాగా తెలంగాణ( Telangana )లోని అన్ని పురావస్తు స్థలాల కంటే ఎక్కువగా ఇక్ష్వాకుల నాటి శిల్పాలు ఇక్కడ దొరికాయని అంటారు.

ఇట్లా ఇక్కడ దొరికిన ప్రతీ రాతి ముక్కా ఒక కళాఖండమేనని చెబుతుంటారు.దక్షిణ భారతంలో బోధిసత్వుడి నిలువెత్తు స్టక్కో ప్రతిమ కేవలం ఫణిగిరి తవ్వకాల్లో దొరికిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.1941లో అప్పటి నిజాం సర్కార్ ఫణిగిరిలో తొలుత తవ్వకాలు జరిపి బౌద్ద ఆధారాలు కనుగొన్నట్లుతెలుస్తుంది.2001-2007లలో,తిరిగి 2018-19లో ఇక్కడ తవ్వకాలు జరిగాయి.మార్చి 31, 2024న జరిపిన తవ్వకాల్లో ఇక్కడ నాణేలు,తోరణాలు, శాసనాలు,వ్యాసాలు,లిఖిత పూర్వక స్థంభాలు కనుగొన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube