శెట్టిపాలెం రైస్ ఇండస్ట్రీలో కార్మికుడు మృతి

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని సంతోష్ రైస్ మిల్లులో గురువారం ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు.మృతుని కుమారుడు మిర్యాల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మిరియాల రంగయ్య(60) గత కొంత కాలంగా శెట్టిపాలెంలోని సంతోష్ రైస్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు.

 Worker Dies In Shettipalem Rice Industry, Worker Dies ,shettipalem Rice Industry-TeluguStop.com

పనిలో భాగంగా గురువారం ధాన్యం వెల్వెటర్ పైన శుభ్రం చేసేందుకు మెట్లపైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న వేములపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర పారబాయిల్డ్ రైస్ మిల్లులో గత కొన్నిరోజుల క్రితం మిల్లు ఫ్యాన్ లో పడి వలస కార్మికుని చేయి కట్ అయిన సంఘటన మరువక ముందే మరొక సంఘటన జరగడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

మిల్లుల యాజమాన్యం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కార్మికులకు సరైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube