తండాల్లో మొదలైన నీటి కష్టాలు...!

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.వాటిల్లో 6 మేజర్ గ్రామ పంచాయతీల కింద అప్పలమ్మగూడెం,మటూర్,రాగడప,డొంకతండా,పలుగు,బొర్రయపాలెం వంటి దాదాపుగా 25 తండాలు ఉన్నాయి.

 Water Problems Started In The Tandas , Water Problems, Appalammagudem, Mathur, R-TeluguStop.com

ఈ తండాల్లో ఇప్పుడే తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు.వ్యవసాయ బోర్ల వద్దకు బిందెలతో చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడ,మగ పరుగులు తీస్తున్నారు.

ఒక్కో తండాలో లక్షలు వెచ్చించి పదేళ్లుగా వివిధ పథకాల కింద మినీ ట్యాంకులు, ఓవర్‌హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేసినా పట్టించుకునేవారే కరువయ్యారు.తండాల్లో బోర్లు వెసి సింగల్ ఫేజ్ మోటార్లను ఏర్పాటు చేశారు.

ఇక్కడ విద్యుత్ ఉంటేనే నీళ్లు లేదంటే అంతే సంగతులు.ఎక్కడా చేతిపంపులు పనిచేయడం లేదు.

నీటి కోసం వ్యవసాయ బావులు,చెరువులను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు.కలుషిత నీరు తాగి ఇటీవల తండాల్లో ప్రజలు రోగాల బారిన పడ్డారని,పగలు విద్యుత్ లేక పోవడం రాత్రుళ్లు తాగునీటి కోసం బోర్ల దగ్గరకు వెళ్లి విద్యుదాఘాతానికి గురవుతున్నారని,ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని సీత్యా తండా,సూర్యతండా మంగళ్ తండా,లోక్యా తండా,కున్యతండా,రూప్ల తండా వాసులు నల్గొండ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

వేసవి కాలం రానేలేదు,ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube