ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.43
సూర్యాస్తమయం: సాయంత్రం.6.19
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.5.51 ల6.27 సా7.03 ల7.27
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12
ల2.46 ల3.34
మేషం:

ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
వృషభం:

ఈరోజు ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
మిథునం:

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.ఇంటాబయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
కర్కాటకం:

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
సింహం:

ఈరోజు ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు.వ్యాపార వ్యవహారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి.
బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.
కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని పనులు పూర్తిగా విజయవంతం అవుతాయి.దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మీ జీవితం మనశ్శాంతిగా ఉంటుంది.కొన్ని ఒప్పందాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తుల:

ఈరోజు బంధు, మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు.
ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
వృశ్చికం:

ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థిక పురోగతి సాధిస్తారు.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ధనుస్సు:

ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మకరం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి.నూతన రుణయత్నాలు చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.
కుంభం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
మీనం:

ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.