కామ్రేడ్ సిలువేరు అబ్రహం పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం:డేవిడ్ కుమార్

నల్లగొండ జిల్లా:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు,సిపిఐ (ఎం-ఎల్)( CPI(ML) ) న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకుడు, కామ్రేడ్ సిలువేరు అబ్రహం రెండవ వర్ధంతి సభను శాలిగౌరారం మండలం, చిత్తలూరు గ్రామంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సభకు ముఖ్యాతిధిగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.

 Let S Move With The Fighting Spirit Of Comrade Siluveru Abraham: David Kumar , C-TeluguStop.com

డేవిడ్ కుమార్ హాజరై మాట్లాడుతూ కామ్రేడ్ అబ్రహం( Abraham ) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం,రజాకార్లకు వ్యతిరేకంగా గ్రామాలలో పెత్తందారులు, దొరలు,పటేల్,పట్వారి, దళారులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన వాలంటీర్ గా ముందుకొచ్చి పోరాటం చేశాడని తెలిపారు.పోలీస్ క్యాంపుల మధ్యనే శత్రువుల కోసం కాపు కాసాడన్నారు.

ఉద్యమ సమయంలో అనేక నిర్బంధాలను,అరెస్టులను,జైలు జీవితాలను, అనుభవించాడన్నారు.పోరాటం విరమణ తర్వాత కూడా కామ్రేడ్ యానాల మల్లారెడ్డి,బూరుగు అంజయ్య,పలస భిక్షం,తోట సోమయ్య సహచర్యంతో నక్సల్బరీ,గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల పిలుపునందుకొని నకిరేకల్ ప్రాంతంలో జరిగిన భూ పోరాటాలు,కూలిరేట్ల పెంపు,జీతగాండ్ల సమ్మె,సారా వ్యతిరేక పోరాటాలలో అగ్రభాగాన నిలబడినాడని కొనియాడారు.

చిత్తలూరు గ్రామంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం( Telangana Armed Struggle )లో ఆరితెరినటువంటి కామ్రేడ్ సుంకరి సాయన్న,గిరగాని లక్ష్మీనర్స్ (గుండయ్య), నంద్యాల మల్లయ్య,ఎల్లమల్ల రాములతో పాటు సిలువేరు అబ్రహం అనేక పోరాటాలలో భాగస్వామ్యం అయ్యాడని అన్నారు.శత్రువులు, పోలీసులు అనేక సందర్భాలలో పార్టీ రహస్యాలు తెలపాలని, నాయకుల వివరాలు చెప్పాలని బలవంతంగా వేధించినా పార్టీ ఇచ్చిన పిలుపుతో క్రమశిక్షణతో పార్టీ రహస్యాలను బయటికి చెప్పలేదని అన్నారు.

దోపిడీ,పీడన,అసమానతలకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వంలో జరిగే పోరాటంలో కామ్రేడ్ సిలువేరు అబ్రహం తన చివరి మజిలీ వరకు కొనసాగాడని,నికార్సైన విప్లవ కమ్యూనిస్టు నాయకుడిగా,కార్యకర్తగా పనిచేశాడని తెలిపారు.కామ్రేడ్ సిలువేరు అబ్రహం అందించిన పోరాట స్ఫూర్తితో నేడు దేశంలో,రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక, పాసిస్తూ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు,అశేషప్రజానికం ఉద్యమించాలని,అప్పుడే కామ్రేడ్ అబ్రహంకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామని తెలిపారు.

నమ్మిన సిద్ధాంతం,ఆశయాల కొరకు కడవరకు పోరాడి అమరులైన వారు ప్రజల హృదయాలలో,ప్రజా పోరాటాలల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, అఖిల భారత రైతు-కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి, పి.డి.ఎస్,యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబోయిన కిరణ్,పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పజ్జూరు ఉపేంద్ర, పివైఎల్ జిల్లా అధ్యక్షుడు మామిడోజు వెంకటేశ్వర్లు నాయకులు సిలువేరు జానయ్య,అంబటి వెంకటేశం, యలమల్ల సైదులు,తుడి శ్రీశైలం,రావుల లింగయ్య, బండారు వెంకన్న, పసుపులేటి సోమయ్య,అంబటి నర్సయ్య, భిక్షం,పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube