నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న వర్కర్లను అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన కాపీలను సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మినీ అంగన్వాడీలకు అందజేశారు.ఎమ్మేల్యే చేతుల మీదుగా జీవో కాపీలను అందుకున్న మినీ అంగన్వాడీలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మేల్యే వేముల వీరేశం( Vemula Veeresham ) మాట్లడుతూ అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు సరైన నడక,నడత నేర్పుతూ, పిల్లలకు,గర్భిణీలకు,బాలింతలకు పౌష్ఠికాహారం అందజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మినీ అంగన్వాడీ( Mini Anganwadi ) టీచర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ,నకిరేకల్ ప్రాజెక్ట్ సిడిపివో అగాశ్ర అంజం, సెక్టార్ సూపర్వైజర్లు అంజలి,సరిత తదితరులు పాల్గొన్నారు.