నేరేడుచర్లలో రెండు హాస్పిటల్స్ సీజ్: వైద్యాధికారిణి పున్నా నాగిని

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలో అనుమతులు (సరైన పత్రాలు),డాక్టర్లు,ఫార్మసిస్ట్,ల్యాబ్ టెక్నీషియన్ లేకుండా నడిపిస్తూ,రోగులకు వైద్యం అందిస్తున్న శ్రీ అమ్మ హాస్పిటల్,శ్రీ సాయి శ్రీనివాస హాస్పిటల్స్ ను సీజ్ చేసినట్లు నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డా.పున్నా నాగి( Punna Nagini )ని తెలిపారు.

 Two Hospitals Under Siege In Nereduchar: Medical Officer Punna Nagini-TeluguStop.com

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,డిఎం హెచ్ ఓ డా.కోటాచలం ఆదేశాలతో గురువారం పట్టణంలోని ప్రైవేట్ హాస్పటల్స్ లో రిజిస్ట్రేషన్,ఫార్మసీ,ల్యాబ్, డ్యూటీ డాక్టర్స్ పట్ల తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్పటల్స్ నియమ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని, అనుమతులు,డాక్టర్లు లేకుండా నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శ్రీనివాస్,హెల్త్ అసిస్టెంట్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube