తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు ఉదయభాను( udaya bhanu ).తెలుగు ఛానెల్స్ లో, ముఖ్యంగా గేమ్ షోస్, టాక్ షోస్, రియాలిటీ షోస్ మొదలైన కొత్తలో అన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా వ్యవహరించింది ఈవిడే.
ఆరోజుల్లో అంత బిజీగా విజయవంతమైన కెరీర్ ను సాగించిన ఉదయభాను ఇప్పడు ఏమయ్యారు? చాలా ఏళ్లుగా ఈమె బుల్లితెరకు దూరంగానే ఉంటోంది.దీనికి కారణం ఎవరు? ఉదయభాను అంటే గిట్టనివారు ఎవరైనా ఆమె పై కుట్ర పన్నారా? అసలు విషయం ఏమిటంటే.
ఉదయభాను తెలుగు యాంకర్స్( Telugu anchors ) లో అందరికంటే సీనియర్.ఒకప్పుడు అందరికంటే పాపులర్ కూడా.ఈటీవీలో ఢీ డాన్స్ షో, జెమినీ టీవిలో చాంగురే బంగారు లేడీ, మాటీవీలో రేలారే రేలా, జీ తెలుగులో తీన్మార్….ఇలా ఏ ఛానల్ చూసిన, ఏ షో చూసిన ఆమె కనిపించేది.
ఆమె అనేక షోలలో జడ్జిగా కూడా ప్రత్యక్షమయింది.ఐతే ఈమధ్య ఉదయభాను ఒక ఇంటర్వ్యూలో కనిపించి తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని, తనపై కుట్ర పన్నుతున్నారని చెప్పుకొచ్చింది.
ఎన్నో ఏళ్లపాటు ఒక సక్సెసఫుల్ కెరీర్ రన్ ఉన్న ఉదయభాను ఇలాంటి కామెంట్స్ చెయ్యడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది అందరికి.
ఉదయభాను వయసు ఇప్పుడు 43 ఏళ్ళు.తెర మీద ఎప్పుడు నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉండే ఆమె జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయ్.ఉదయభాను తండ్రి ఒక డాక్టర్.
తల్లి ఆయర్వేద వైద్యురాలు.ఆమె తండ్రి ఒక కవి కూడా.
ఆయన కలం పేరైన “ఉదయభాను”నే కూతురికి పెట్టుకున్నాడు.ఆమె నాలుగేళ్ళ వయసులో తండ్రిని పోగొట్టుకుంది.
తరువాత ఆమె తల్లి ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది.ఆమె 15వ ఏట ఆమెకు ఇష్టం లేకుండా ఒక ముస్లిం యువకుడితో వివాహం చేసారు పెద్దలు.
కొన్నాళ్ళకు అతనినుండి విడాకులు తీసుకొని విజయకుమార్( Vijayakumar ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
చాలా కాలం కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలతో ఇబ్బంది పడింది.క్రమేపి ఆమె వయసు పెరిగింది.గ్రేస్ తగ్గింది.
కొత్త యాంకర్లు ఎక్కువయ్యారు.ఇదే ఆమె బుల్లితెరకు దూరం కావడానికి కారణం అనుకుంటారు ఎవరైనా.
కానీ ఉదయభాను మాటలు చూస్తే ఆలా అనిపించడం లేదు.ఉదయభానులో ఉన్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ గుణమే ఆమెకు మైనస్ అయ్యిందా? ఆమెను నిజంగానే తమకు కాంపిటీషన్ అని ఫీల్ అయినా వాళ్ళు తోక్కేస్తున్నారు? అదే నిజమైతే వాళ్లెవరో చెప్పేయొచ్చు కదా!!
.