మంచి మనసు చాటుకున్న బేబీ ప్రొడ్యూసర్... ప్రశంసలు కురిపిస్తున్న నేటిజన్స్!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన బేబీ సినిమా( Baby Movie ) పేరు మారు మోగిపోతుంది.ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి ఈ సినిమా పట్ల ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 A Baby Producer With A Good Hear, Baby Movie , Sai Rajesh, Social Media, Vaisha-TeluguStop.com

సాయి రాజేష్( Sai Rajesh ) దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) వైష్ణవి చైతన్య ( Vaishanavi Chaitanya ) హీరో హీరోయిన్లుగా నటించిన బేబీ సినిమాకు ఎస్.కె.ఎన్(SKN) నిర్మాతగా వ్యవహరించారు.ఇక ఈయన కింది స్థాయి నుంచి కష్టపడుతూ నేడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా విజయం సాధించారని ఈయన గురించి అల్లు అర్జున్ చాలా క్లియర్ గా చెప్పారు.

ఇలా నిర్మాతగా నేడు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ తన అమ్మకు బాగా లేదని చెప్పడంతో వెనక ముందు ఆలోచించకుండా ఏకంగా ఆ నెటిజన్ కు 50 వేల రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేసి మంచి మనసును చాటుకున్నారు.ట్విట్టర్ వేదికగా ఒక నెటిజన్ తన తల్లికి కడుపులో ఇన్ఫెక్షన్ అయిందని కిడ్నీలో స్టోన్స్ కూడా ఉన్నాయని ట్రీట్మెంట్ కోసం 1,50,000 వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.ఇప్పటికీ ఎంతో కష్టపడి లక్ష రూపాయలు సంపాదించానని తన తల్లి కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ విధంగా తన తల్లి ఇబ్బందులలో ఉందని చికిత్స కోసం ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురుచూస్తున్నటువంటి ఆ నెటిజన్ కు ఏకంగా నిర్మాత ఎస్ కే ఎన్ తన బ్యాంకు డీటెయిల్స్ తీసుకొని ఏకంగా 50 రూపాయలు క్రెడిట్ చేస్తూ తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోమని చెప్పారు.ఇలా అమ్మ కోసం అనీ చెప్పగానే వెనుక ముందు ఆలోచించకుండా ఇలా ఆర్థిక సహాయం చేయడంతో ఈయన మంచి మనసుపట్ల నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube