Winter Tea : చలికాలంలో రోజు ఈ టీ తాగితే సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి కూడా రావు!

ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరి రోగ‌ నిరోధక వ్యవస్థ సహజంగానే బలహీన పడుతుంది.

 If You Drink This Tea Daily During Winter, Seasonal Diseases Will Not Occur,  Te-TeluguStop.com

దాంతో జలుబు, దగ్గు, జ్వరం తదితర సీజనల్ వ్యాధులు చుట్టుముట్టి ముప్ప తిప్పలు పెడుతుంటాయి.వాటి నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో పాట్లు పడుతుంటారు.

అయితే సీజనల్ వ్యాధులు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే టీ ని ప్రస్తుత చలికాలంలో ప్రతి రోజూ తాగితే సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రావడానికే భయపడతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.మూడు, నాలుగు నిమిషాల పాటు వాటర్ మరిగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, అర అంగుళం దంచిన అల్లం ముక్క, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకుని కనీసం ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాట‌ర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Tips, Healthy Tea-Telugu Health Tips

ఇందులో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి సేవించాలి.ఈ మసాలా టీ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ప్రతిరోజు ఈ మసాలా టీ ని తీసుకుంటే కనుక రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

దాంతో జలుబు, దగ్గు, గొంతువాపు, జ్వరం తదితర సీజన‌ల్‌ సమస్యలు ద‌రిచేరకుండా ఉంటాయి.అలాగే ఈ టీను తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్న దూరం అవుతాయి.

కాబట్టి ఈ చలికాలంలో తప్పకుండా పైన చెప్పిన టీను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube