సినిమా అంటే ఎలా పడిచచ్చిపోతారో, క్రికెట్ అంటే కూడా అంతకు వెయ్యి రెట్లు ఎక్కువగా పడిచచ్చిపోయే అభిమానులు ఉన్నారు.సినిమాలకి, సినిమా హీరోలకి, హీరోయిన్స్ కి ఉన్న దాని కంటే ఎక్కువగా క్రికెట్ కి, క్రికెట్ ఆడే ఆటగాళ్లకు క్రేజ్ ఉంది.
సినిమా అనేది ఒక రాష్ట్రంలోనే ఆడుతుంది.ప్యాన్ ఇండియా మూవీ అయితే దేశవ్యాప్తంగా ఆడుతుంది.
కానీ క్రికెట్ అలా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆడుతుంది.అందుకే దీనికి కోట్లాది మంది అభిమానులు ఉంటారు.
సినిమా, స్పోర్ట్స్ ఈ రెండూ విభిన్న రంగాలే అయినా చూసే ప్రేక్షకులకి మాత్రం రెండూ రెండు కళ్లుగా భావిస్తారు.ఈ రెండిటిలో ఏది లేకపోయినా ఉండలేరు.
అలాంటి సంబంధం ఉంది ఈ సినిమా రంగానికి, క్రికెట్ రంగానికి.అభిమానుల దృష్టిలోనే కాదు, నిజంగా ఈ సినిమాకి, క్రికెట్ కి విడదీయలేని సంబంధం ఉంది.
క్రికెట్ కి సాధారణ ప్రేక్షకులే కాదు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ప్రేక్షకులే.వాళ్ళు కూడా కొంతమంది క్రికెటర్స్ ని అభిమానిస్తారు, ఆరాధిస్తారు.
ఇంకో అడుగు ముందుకేసి ప్రేమిస్తారు.ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారు.హీరోయిన్స్, క్రికెటర్స్ ప్రేమించుకోవడం అనే సాంప్రదాయం ఈనాటిది కాదు.80 వ కాలంలోనే ఈ ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి.
పటోడి – షర్మిల ఠాగూర్ నుంచి విరాట్ కోహ్లీ – అనుష్కశర్మ వరకూ చాలా మంది ప్రేమ వివాహం చేసుకుని ఒకటయ్యారు.అయితే కొంతమంది హీరోయిన్స్ కి మాత్రం వాళ్ళ ప్రేమ పెళ్లి వరకూ వెళ్లలేదు.
వారిలో హీరోయిన్ నగ్మ ఒకరు.

అప్పుడప్పుడే గంగూలీ క్రికెటర్ గా ఎదుగుతున్న సమయం.ఇక నగ్మ అప్పటికే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
అది కాస్తా ప్రేమగా మారింది.కొన్నాళ్లు రిలేషన్ కొనసాగించారు.
నగ్మ పెళ్లి ప్రపోజల్ తెచ్చేసరికి గంగూలీకి అప్పటికే పెళ్లి కావడం వల్ల తన భార్యకి విడాకులు ఇవ్వడం కుదరదని చెప్పేశారు.దీంతో నగ్మ మోసపోయానని గ్రహించి గంగూలీకి బ్రేకప్ చెప్పేశారు.

ఇక ఈమెలానే నటి కిమ్ శర్మ కూడా యువరాజ్ సింగ్ తో కొన్నాళ్లు ప్రేమయానం సాగించారు.యువరాజ్ సింగ్ ను పెళ్లి చేసుకోవాలని భావించిన కిమ్ శర్మ కల కలగానే మిగిలిపోయింది.యువరాజ్ సింగ్ తల్లికి వీరి పెళ్లి ఇష్టం లేదని ఆ మధ్య గొడవలు కూడా అయ్యాయని వార్తలు వచ్చాయి.యువరాజ్ కూడా కిమ్ ను దూరం పెడుతూ వచ్చారు.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన కిమ్ శర్మ, బ్రేకప్ చెప్పేసి రిలేషన్ నుంచి బయటకు వచ్చేశారు.

మరో నటి నీనా గుప్తా, అప్పట్లో క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ తో లవ్ లో పడ్డారు.రిచర్డ్స్ కి అప్పటికే పెళ్లయ్యింది.అయినప్పటికీ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు.
కలిసి సహజీవనం కూడా చేశారు.ఈ క్రమంలోనే నీనా గుప్తా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
రిచర్డ్స్ తన భార్యకు విడాకులు ఇచ్చి, నిన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చారు.దీంతో ఆమె చేసేదేమీ లేక వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
అయితే ఇది జరిగిన 25 ఏళ్ళకి ఆమె మీడియా ముందుకొచ్చి రిచర్డ్స్ తనని మోసం చేశాడని చెప్పుకొచ్చారు.

ఎలిజబెత్ హుర్లే అని నటి కూడా షేన్ వార్న్ తో కలిసి ఆఫ్ స్క్రీన్ లో రొమాన్స్ చేశారు.షేన్ వార్న్ ఈమె వెంటపడి మరీ ప్రేమించాడు.అలా కొన్నాళ్లు డేటింగ్ చేసి, మోజు తీరాక వదిలేశారు.
షేన్ వార్న్ కి అమ్మాయిల పిచ్చి ఉందని ఎలిజబెత్ అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు.ఇలా సినిమా నటీమణులు, క్రికెటర్స్ చేతిలో మోసపోయారు.