నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని చత్రపతి శివాజీ కబడ్డీ స్పోర్ట్స్ క్లబ్బుకు చెందిన కుంటిగొర్ల కోటేష్ ఈనెల 28 నుండి 30 వరకు ఖమ్మం పట్టణంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ క్రీడా ప్రదర్శనతో నల్గొండ జిల్లా జట్టు ప్రథమ స్థానం పొందడంలో ప్రధాన పాత్ర పోషించిన కుంటిగొర్ల కోటేష్ కు బెస్ట్ డిపెండర్ అవార్డుని ప్రధానం చేశారని స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మందడి నర్సిరెడ్డి,బొమ్మపాల గిరిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్ సాయ్ అకాడమీలో కోచ్ లు శ్రీనివాసరావు,భాస్కరరావు సారధ్యంలో కోటేష్ శిక్షణ పొందుతున్నట్లు చెప్పారు.




Latest Nalgonda News