పేడ పురుగని లైట్ తీసుకునేరు... బీఎండబ్ల్యూ కారు కన్నా ఖరీదైనది...!

నల్లగొండ జిల్లా: పేడ పురుగు(స్టాగ్ బీటిల్) మనం పల్లెటూరిలో తరుచూ చూస్తాం.చిరాకు పడుతుంటాం.

 Stag Beetle More Expensive Than A Bmw Car, Stag Beetle ,expensive Stag Beetle,-TeluguStop.com

కానీ,ఈ ఇన్సెక్ట్ అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉందని ముచ్చట పడుతుంటారు ఇతర దేశాల ప్రజలు.కాగా లండన్ బేస్డ్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం…వెచ్చని వాతావరణంలో వృద్ధి చెందే ఈ పురుగు.

తీపి ద్రవాలు, కలపను తింటుంది.మూడు నుంచి ఏడు సంవత్సరాలు జీవిస్తుంది.

పర్యావరణంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.తమ లైఫ్ సైకిల్ లో 2-6 గ్రాముల బరువు ఉంటుండగా మగ కీటకం 35-75 మిమీ పొడవు, ఆడ కీటకం 30-50 మిమీ పొడవు ఉంటుంది.

ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది.

ముఖ్యంగా జపాన్ లో ఈ పురుగు తమకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతారు.

ఆకస్మిక ధన లాభం కలుగుతుందని విశ్వసిస్తారు.కానీ,అక్కడ ఇవి ఎక్కువగా కనిపించవు.

కాబట్టి ఈ అరుదైన జాతికి డిమాండ్ పెరిగింది.లక్షలు పెట్టి మరీ సొంతం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రత్యేకంగా వీటిని పెంచి డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ చేశారు వ్యాపారస్తులు.మొత్తానికి ఒక్క స్టాగ్ బీటిల్ ధర ప్రస్తుతం రూ.75 లక్షలకు పైమాటే.కాగా దీని ఖరీదు బీఎండబ్ల్యూ కారు కన్నా ఎక్కువేనని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube