నల్లగొండ జిల్లా:జిల్లాలోని అన్ని కమ్యూనిటీ పోలీసింగ్ నేను సైతం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ టీవి కెమెరాలను ప్రక్షాళన చేస్తున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి( SP Chandana Deepti ) అన్నారు.శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు అమర్చినవి పట్టణంలో రోడ్డు నిర్మాణ పనులను జరుగుతున్న కారణంగా కొన్ని పనిచేయడం లేదని,అవి ఎన్ని పని చేస్తున్నాయి? ఎన్ని పని చేయడం లేదో ఆడిట్ చేసి రెండు మూడు రోజుల్లో వాటిని పునరుద్ధించడం జరుగుతుందని,ఇంకా జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ,దేవరకొండ ఇతర మున్సిపాలిటీ ఏరియాలలో ప్రత్యేక ఎక్కువ నిఘా కెమెరాలను అమర్చడానికి మరిన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జిల్లాలో అన్ని ప్రధాన రహదారుల కూడళ్ళలో, కాలనీల్లో ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ప్రజా రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ నేర నియంత్రణ,మెరుగైన సమాజ నిర్మాణం కొరకు సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు.
వీటిని ప్రతి ప్రాతంలో ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో సిసి కెమెరాలు కీలకంగా మారుతున్నాయని,అనేక కేసులు ఛేదించడంలో, దొంగతనాలు,రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించామన్నారు.ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని అప్పుడే గ్రామీణ ప్రాంతాలలో నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చన్నారు.
కావున ప్రతి ఒక్క గ్రామాలలో, పట్టణాలలో,వ్యాపార సముదాయాల వద్ద సిసిటివి కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు.