నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద విషాదం

నల్గొండ జిల్లా:నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం 10వ క్రస్ట్ గేటు వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు క్రిందపడి తలకు బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషాదఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.నాగార్జునసాగర్ విజయపురి టౌన్ ఎస్సై బి.

 Tragedy At Nagarjuna Sagar Dam-TeluguStop.com

రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం 10వ గేటు వద్ద పనిచేస్తున్న జార్ఖండ్ కు చెందిన శివకుమార్ గోపి(21) ప్రమాదవశాత్తు జారి పడ్డాడు.గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన స్థానిక కమల నెహ్రూ హాస్పిటల్ కి తీసుకెళ్లగా తలకి బలమైన దెబ్బ తగిలి ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండటంతో వైద్యుల సూచన మేరకు నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందాడు.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.రాంబాబు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube