టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయండి:ఈసీ

నల్లగొండ జిల్లా:లేని అధికారంతో గుర్తు మార్చి విధి నిర్వహణలో వైఫల్యం చెందినందుకు మునుగోడు మాజీ రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)శుక్రవారం ఆదేశించింది.ఈ నేపథ్యంలో జగన్నాథరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

 File A Case Against Trs: Ec-TeluguStop.com

యాదాద్రికి 300 మందిని తీసుకెళ్లి ప్రమాణం చేయించిన వ్యవహరంలో వచ్చిన ఫిర్యాదుపై కూడా ఈసీ స్పందించింది.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

దానికయ్యే ఖర్చును టిఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో వేయాలని ఆదేశించింది.ఈవీఎం బ్యాలెట్‌లో బోటుకు బదులు మరో గుర్తు ముద్రించినందుకు చౌటుప్పల్‌ ఎమ్మార్వోపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube