నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక హడావుడి శుక్రవారం నుండి అధికారికంగా ప్రారంభం కానుంది.నోటిఫికేషన్ విడుదల కావడమే ఆలస్యం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ అవుతుంది.
నామినేషన్లు దాఖలకు ఈనెల 14 వరకు గడువు ఉండగా ఈ నెల10న బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 11న కాంగ్రేస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి ముందుగా 2 సెట్లతో,14 న మరోసారి భారీ ఎత్తున నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.ఈనెల 12న టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని,13 లేదా 14న టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈనెల 14 లోగా సీఈసీ గుర్తిస్తే మునుగోడులో బీఆర్ఎస్ తరుపున కూసుకుంట్ల పోటీలో ఉంటారని,లేదంటే టీఆర్ఎస్ తరపునే పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.దీనితో చండూరు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు సమయం ఉంటుందని,శని,ఆదివారాల్లో నామినేషన్లు దాఖలకు సెలవు ఉండడంతో సోమవారం నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది.