30 ఏళ్ల క్రితం పట్టాలు పంపిణీ... ఆ ప్రభుత్వ భూమి ఆక్రమించే యత్నం

నల్లగొండ జిల్లా: గట్టుప్పల మండలం తెరట్టుపల్లి గ్రామంలోని చింతలగడ్డలో సర్వే నెంబర్ 377,378 లో సుమారు 7 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ భూమిలో 1993లో ఆనాటి ప్రభుత్వం ఇండ్లులేని 154 మంది నిరుపేదలను గుర్తించి,ఇళ్ల పట్టాలిచ్చింది.అక్కడ కనీస సౌకర్యాల్లేక,ఎవరి ప్లాట్ ఎక్కడుందో తెలియక ఇళ్లు నిర్మించుకోలేదు.

 Distribution Of Land Papers 30 Years Ago Attempt To Encroach On Government Land,-TeluguStop.com

ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది.ఇదే అదునుగా పక్క రైతు గిరి సత్తయ్య కబ్జా చేసేందుకు ప్రయత్నం చేయగా గతంలో అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఫీల్డ్ మీదకొచ్చి పరిశీలించి,సదరు రైతును ప్రభుత్వ భూమిలోకి రాకుండా అగ్రిమెంట్ రాయించారు.

ఖాళీగా ఉండడంతో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఈ ఇళ్ల స్థలాలను పరిశీలించి,రూ.10 లక్షల సహాయం చేస్తాను, కేసీఆర్ కాలనీగా పేరు పెట్టాలని కోరి,ఆ స్థలంలో మిషన్ భగీరథ ట్యాంకు కూడా నిర్మించారు.సమస్య పరిష్కారమైందని భావించిన లబ్ధిదారులు ఇప్పుడు నివాసానికి అనుకూలంగా ఉండడంతో ఇండ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

కానీ,నేటి అధికారులు నిర్లక్ష్యంగా రైతు రాసిచ్చిన అగ్రిమెంట్ మాయం చేశారు.దీనితో పేదలకు పట్టాలు పంపిణీ చేసిన భూమి రోడ్డు పక్కన ఉండడం, భూముల ధరలకు రెక్కలు రావడంతో మళ్లీ ఆ రైతు ఇండ్ల స్థలానికి కేటాయించిన భూమిలో సేద్యం చేసేందుకు రెడీ అయ్యాడు.

ప్రభుత్వ పట్టాలు ఇచ్చింది ఇక్కడ కాదని,

తమ పూర్వీకుల సమాధులు ఉన్న స్థలాన్ని చూపుతున్నాడని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని తమ ఇళ్ల స్థలాలను రక్షించి,పట్టాల ప్రకారం స్థలాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

పట్టలిచ్చారు ప్లాట్స్ మరిచారని గ్రామానికి చెందిన సింగం శేఖర్ అనే లబ్దిదారుడు వాపోయారు.గత ప్రజా ప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం కారణంగా పట్టాలు పంపిణీ చేసినా 30 ఏళ్లుగా పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ జరగలేదు.

ఇదే అదునుగా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు.స్థలాలు పంపిణీ జరగకపోతే లబ్దిదారులు త్వరలో ఆందోళనకు సిద్దమవుతం.అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి స్థలాలను పంపిణీ చేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube