యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో రూ.4 లక్షల 80 వేల సొంత ఖర్చులతో కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన అధునాతన అంగన్వాడి భవనాన్ని నిర్మించారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు కస్తూరి చరణ్ పుట్టిన రోజు కానుకగా ఓపెన్ చేసి ప్రజలకు అందజేశారు.ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ పేదరికంలో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
మన ఊరి బడులను మనమే బాగు చేసుకోవాలని మా ఫౌండేషన్ విద్యపై, అంగన్వాడి పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు.ప్రభుత్వాలు కస్తూర్బా విద్యాలయాలను పట్టించుకోని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అలివేలు, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత,నిరూప,సాగర్ల లింగయ్య,జగన్,జక్కలి రాజు,ముత్తయ్య,జక్కలి విక్రమ్,దేవేందర్,విరమల్ల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.