నేడు నల్లగొండ జిల్లాకు అల్లు అర్జున్...!

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండల సమీపంలోని ముసలమ్మ చెట్టు దగ్గర తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ స్టేట్ లీడర్,అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన పార్టీ కార్యాలయం,ఫంక్షన్ హాల్ ను అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో వ్యవసాయ క్షేత్రంలో చంద్రశేఖర్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు.10 వేల మందికి భోజన ఏర్పాట్లతో పాటు,మహిళలకు చీరల పంపిణీ చేయనున్నారు.బన్నీ రాకతో సాగర్ రాజకీయంలో రసవత్తర చర్చ జరుగుతుంది.

 Today Allu Arjun Coming Nalgonda District, Allu Arjun ,nalgonda District, Kancha-TeluguStop.com

కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.అక్కడి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రస్తుతం సాగర్‌ పైన దృష్టి పెట్టారని టాక్ నడుస్తోంది.

దీనితో పెద్దవూర తన వ్యవసాయ క్షేత్రంలో ఏకంగా పార్టీ కార్యాలయం,భారీ ఫంక్షన్ హల్ నిర్మాణం చేశారు.

తన రాజకీయ ప్రచారం స్టార్ సినీ హీరో తన అల్లుడు అల్లు అర్జున్ తో ప్రారంభించాలని కోరగా మామ కోసం అల్లుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

నిడమనూరు, పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో కంచర్లకు సామాజికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా సత్సంబంధాలు ఉండడంతో కలిసొచ్చే అవకాశం ఉందని, బీఆర్ఎస్,కాంగ్రెస్ తో చర్చలు జరిపి సాగర్ లో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్‌ను కాదని కేసీఆర్ కంచర్లకు టికెట్ ఇస్తారా? అనే సందేహాలు ఉన్నాయి.అధికార పార్టీ నుండి రాకుంటే కాంగ్రెస్ నుండి కూడా ప్రయత్నం చేయొచ్చని ప్రచారం జరుగుతుంది.మామ కోసం అల్లుడు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా లేదా వేచి చూడాలి మరి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube