నల్లగొండ జిల్లా: మునుగోడు మండల కేంద్రంలోని గ్రంథాలయం శితిలావస్థలో ఉండగా విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నేతలు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా సమస్యకు పరిష్కార మార్గం దొరకలేదు.చివరకు మునుగోడు ఎంపీటీసీ బొడ్డు శ్రావణీనాగరాజు గౌడ్ దృష్టికి సమస్య రాగానే వెంటనే స్పందించి తమ ఎంపీటీసీ నిధుల ద్వారా
3లక్షల 40వేల రూపాయలతో శితిలావస్థకు చేరుకున్న గ్రంథాలయాన్ని ఆధునీకరించి,రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు.
ఎంపీటీసీ కృషిని విద్యార్థులు, నిరుద్యోగులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.ఈ సందర్భంగా ఎంపిటిసి మాట్లాడుతూ బొడ్డు శ్రావణీ గ్రంథాలయానికి ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.







