నన్ను టచ్ చేసి చూడండి...ఈటెల వార్నింగ్

హైదరాబాద్/నల్లగొండ:మునుగోడులో పలుమార్లు నా కాన్వాయ్‌పై దాడికి యత్నించారు.పలివెలలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు.

 Touch Me And See…spear Warning-TeluguStop.com

కేంద్రమంత్రిని అడ్డుకుంటుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని హుజూరబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పలివెలలో ప్రచారం చేస్తున్న నా సతీమణిని దూషించారని,బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వి,జెండా కర్రలతో కొట్టారని,నా గన్ మెన్లు లేకపోతే నా తలకు తీవ్ర గాయాలు అయ్యేవని అన్నారు.

నా పీఆర్‌వో,గన్‌మెన్లకు గాయాలయ్యాయని,టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డీఎస్పీని కొట్టారని,అయినా పోలీసు వ్యవస్థకు కనిపించదని అన్నారు.నాపై ఈగ వాలినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube