ఈటెల కౌరవుల పక్షాన నిలబడి ధర్మం గురించి మాట్లాడుతుండు:జగదీష్ రెడ్డి

హైదరాబాద్/నల్లగొండ:ఈటెల కౌరవుల పక్షాన నిలబడి ధర్మం గురించి మాట్లాడుతుండని,ఏది ధర్మమో,ఏది అధర్మమో మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారని,కానీ,కౌరవుల పక్కన ఉండి ధర్మం గురించి మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలివెలలో బీజేపీ నేతలే టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారని,మా వాళ్లు కనీసం మోటర్ సైకిళ్లు కూడా దిగలేదని,హైదరాబాద్ నుంచి వచ్చిన గుండాలు దాడి చేశారని,మా వాళ్ల తలలు పగలగొట్టారని,పల్లా రాజేశ్వర్ రెడ్డి తల కూడా పగలగొట్టారని తెలిపారు.

 Etela Stands For The Kauravas And Talks About Dharma: Jagadish Reddy-TeluguStop.com

ప్రజలకు తెలుసు ధర్మం ఏందో న్యాయం ఏందో వాళ్లే నిర్ణయిస్తారని,ఎవరు కౌరవుల పక్షాన నిలబడ్డారో తెలుసునని,హింసను సీఎం కేసీఆర్ ఎప్పుడూ ప్రోత్సహించరన్నారు.ఓడిపోతామని తెలిసే ఈటల సానుభూతి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube