నల్లగొండ జిల్లా:తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.డీఎంఈ,ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు.
ఈక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది.
బుధవారం ఇందుకు సంబంధించి రెండు జీవోలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.