కోలీవుడ్ నటుడు హీరో అజిత్ ( Ajith )గురించి తెలియని వారు ఎవరు ఉండరు.సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు అజిత్.
ఇక ఇప్పటికీ తాను సొంతంగా ఫోన్ కూడా ఉపయోగించని ఏకైక హీరో అజిత్ ఒక్కరే అని అందరికి తెలిసిన విషయమే.ఇక అజిత్ సోషల్ మీడియా లో ఎక్కువగా యాక్టివ్ ఉండకపోయినా.
తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ ను ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను ప్రశాంతంగా ఉంచుకుంటారు.ఒక వైపు తనకు ఇష్టమైన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు వరుస చిత్రాలను చేస్తున్నారు.
ప్రస్తుతం హీరో అజిత్ విదాముయర్చి సినిమాలో ( Vidamuerchi )నటిస్తున్నారు.గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా అజిత్ తన ప్రాణాలనే పణంగా పెడుతూ సాహసాలే చేస్తున్నాడని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

గతంలో కూడా ఇలానే యాక్షన్ సీన్ ( Action scene ) కోసం తానే స్వయంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురై, స్వల్ప గాయాలతో బయటపడిన సంగతి అందరికీ తెలిసినదే.మరోసారి ఈ సినిమా కోసం అజిత్ ప్రాణాలను పణంగా పెట్టాడు.ఈ సినిమా షూటింగ్లో భాగంగా యాక్షన్స్ సీన్ షూటింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ఆ వీడియో ఆధారంగా చూస్తే అజిత్ ఉన్న కార్ ను క్రేన్ సహాయంతో గాల్లోకి లేపారు.కారు గాల్లో ఉన్నప్పుడు అందులో హీరో అజిత్ తో పాటు మరో నటుడు ఆరవ్( Actor Aarav ) కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇంతవరకు బాగానే ఉండగా.క్రేన్ సహాయంతో గాల్లోకి లేపిన అనంతరం అక్కడ కొన్ని పల్టీలు కొట్టించారు.
ఈ సమయంలో కూడా ఇద్దరు హీరోలు కారులోనే ఉన్నారు.ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఇలాంటి రిస్క్ స్టంట్స్ చేయడం చాలా ప్రమాదకరమని నెటిజన్స్ అంటున్నారు.

ఇక ఎలాంటి డూప్ సహాయం లేకుండా అదే కారులో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అజిత్ ఫ్యాన్స్.ఇక ఈ సినిమా కోసం హీరో అజిత్ చేసే స్టంట్స్ చూసి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఆకర్షించడంతోపాటు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.సినిమా కోసం ప్రాణం ఇవ్వడం అంటే ఇదేనేమో.అందుకే అజిత్ చాలామంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది ఫ్యాన్స్ రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న హీరో అజిత్, ఆరవ్ తోపాటు త్రిష, రెజీనా, అర్జున్ సర్జా నటిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.
త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమాతోపాటు.
మరో సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ ను కూడా స్టార్ట్ చేశాడు అజిత్.







