ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.దీనితో చాలామంది వారు చేసిన ప్రయాణాలు వారు ఎదురుకున్న సవాళ్లను గురించి తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూన్నారు.
మరికొందరు అయితే కొన్ని భయంకరమైన సంఘటనలు ఎదుర్కొని వాటి ఎక్స్పీరియన్స్ తెలియజేస్తూ, అలాగే ఇలాంటి సాహసాలకు దూరంగా ఉండండి అంటూ సలహాలు కూడా ఇస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అయితే తాజాగా నెదర్లాండ్( Netherlands ) కు చెందిన ఒక మహిళ పైలట్ కూడా అనుకోని అనుభవం ఎదురవ్వడం జరిగింది.
ఆ మహిళ పైలెట్ గాల్లో ఉండగా విమానం పై కప్పు ఒకసారిగా ఓపెన్ అయ్యింది దీంతో ఆ మహిళ భయంకరమైన అనుభవాన్ని పొందింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.నెదర్లాండ్స్ కు చెందిన నరైన్ మెల్కుమ్జన్( Narine Melkumjan ) అనే మహిళా పైలట్ తేలికపాటి విమానాన్ని టేక్ ఆఫ్ చేసి గాల్లోకి ఎరిగే వరకు అంత బాగానే ఉంది.కానీ అనుకోకుండా ఒక్కసారిగా విమానం పైకప్పు ఓపెన్ అవడంతో ఆ మహిళ చాలా కంగారు పడిపోయింది.వేగంగా వీస్తున్న గాలితో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.ఇలా భయంకరమైన పరిస్థితులలో కాసేపు ప్రయాణించి ఆ మహిళ చివరికి సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేసింది.ఈ సంఘటన మొత్తం ఆ మహిళ ఫోన్లో రికార్డు చేసుకుని సోషల్ మీడియా ద్వారా ‘విన్యాసాల శిక్షణలో భాగంగా విమానంతో అది నా రెండో ప్రయాణం.
నేను ఎక్స్ట్రా 330 ఎల్ఎక్స్ విమానంలో( Extra 330 LX on board ) గాల్లో ఉండగానే పైకప్పు తెరుచుకుంది.టేకాఫ్ కు ముందు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని.
, సరైన జాగ్రత్తలు చేసి ఉంటే అంతా బాగానే ఉండేదని తెలిపింది.

ఆ సమయంలో కళ్లద్దాలు కూడా లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది.భారీ శబ్దం, బలమైన గాలులు, ఎటూ సరిగ్గా చూడలేక, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డానని., ఆ సమయంలో కూడా విమానాన్ని నడిపించడం సవాల్ గా మారిందితెలిపింది.
కిందకు దిగాక కంటిచూపు సమస్య దాదాపు 28 గంటల పాటు కళ్లు ఇబ్బంది పెట్టాయని., ఇది నా లైఫ్ లోనే అత్యంత భయానక పరిస్థితని ఆ మహిళ రాసుకొని వచ్చింది.
అలాగే ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణంలో ఎలాంటి నిర్లక్ష్యానికి చోటు ఇవ్వద్దు అంటూ పైలెట్లకు సలహా ఇచ్చింది.అంటూ కామెంట్స్ చేశారు.







