ప్రస్తుత రోజులలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా వారి టాలెంటును వివిధ రకాలుగా నిరూపించుకుంటూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.కొంతమంది వారి ప్రేమను వ్యక్తపరిచేందుకు పరీక్ష పేపర్స్ లో ఆన్సర్స్ రూపంలో రాయడం జరుగుతే, అలాగే కొంతమంది కొన్ని ప్రశ్నలకు వారికి తోచినట్లు ఆన్సర్స్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
ప్రతుతం ఒక యువకుడు రాసిన ఆన్సర్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం కూడా మనం చూస్తూనే ఉంటాం.నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూ ఉండడం అవి చూసి కొంతమంది నేటిజన్స్ వివిధ రకాల కామెంట్ చేయడం సర్వసాధారణమైపోయింది.
ఇలా వైరల్ అవుతున్న విషయాలలో ఏదైనా అంశం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే దానిపై మీమ్ చేసి కూడా వైరల్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలో తాజాగా ఒక యువకుడు రాసిన పరీక్షకు సంబంధించిన పేపర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
సాధారణంగా పరీక్షలు అంటే కొంత మంది ఫస్ట్ ర్యాంకులు( First ranks ) సాధించే విధంగా రాస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఏదో ఒక సినిమా కథలు, సొంత స్టోరీలు లేదా జోక్స్ లాంటివి రాస్తూ ఉంటారు.ఇక మరికొందరు అయితే ఏకంగా పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలకు ఇలాంటి తిక్క సమాధానాలు కూడా రాస్తారా అన్నట్టు ఉంటాయి.ఇక వైరల్ అవుతున్న ఫోటో ఆధారంగా అందులో మూడు ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు రాశాడో చూసి నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఇందులో మొదటి ప్రశ్నగా భూమి గుండ్రంగా ఉందని ప్రూవ్ చేయగలరా అని అడగ్గా.అందుకుగాను ఆ యువకుడు ” నేను చేయలేను ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుందని నేను చెప్పలేదు ” అంటూ సమాధానం రాశాడు.ఇక మరో రెండో ప్రశ్నగా మనకు సూర్యుడు, చంద్రుడు వీరిలో ఎవరు ముఖ్యమని ప్రశ్న అడగగా.
దానికి సమాధానంగా “చంద్రుడు.ఎందుకు అంటే రాత్రి చీకట్లోనూ చంద్రుడు మనకు వెలుగునిస్తాడు.
సూర్యుడు పగటిపూట మాత్రమే కాంతిని ఇస్తాడు కాకపోతే మనకు అది అవసరం ఉండదు” అని సమాధానం రాసుకొచ్చాడు.ఇక మూడో ప్రశ్నగా మూడు ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్స్( Fastest Communications ) ఏమిటి అని అడగగా.
a) టెలిఫోన్, b) ఇంటర్నెట్, c) ఉమెన్ అని ఆ యువకుడు సమాధానం రాసుకొచ్చాడు.ఇక ఈ సమాధానాలు చూసిన కొంతమంది నెటిజన్స్ మాత్రం ఈ యువకుడు చాలా ఫాస్ట్ గురూ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అలాగే కొంతమంది ఈ యువకుడు చేసిన కామెంట్స్ కు నవ్వడం మొదలు పెట్టారు.