బక్క జాడ్సన్ పై టీఆర్ఎస్ నాయకులు దాడికి యత్నం

నల్లగొండ జిల్లా:మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,మంత్రి కేటీఆర్ వారి కుటుంబం చేస్తున్న అవినీతి అక్రమాలపై ఆధారాలతో బయటపెడుతున్న ఏఐసీసీ మెంబెర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బక్క జాడ్సన్ పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడానికి ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.శుక్రవారం కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై బక్క జాడ్సన్,కాళోజి ఛానల్ టీం ఆధ్వర్యంలో మునుగోడులో ప్రదర్షణ చేయడం జరిగింది.

 Trs Leaders Attempt To Attack Bakka Jadson-TeluguStop.com

ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తున్న క్రమంలో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు మరియు కల్వకుంట్ల కవిత అనుచరులు వారిపై దాడికి ప్రయత్నం చేశారు.దీనితో పోలీసులు బక్క జాడ్సన్ ను పోలీసు స్టేషన్ కు తరలించారు.

అయితే దాడి చేసే వారిని వదిలేసి, దాడికి గురయ్యేవారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారని,తనకు జరిగిన అన్యాయంపై బక్క జాడ్సన్ పోలీస్ స్టేషన్ లో దీక్షకు దిగారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి 4 లక్షల 25 వేల కోట్లు అప్పుచేశారని,తెలంగాణలో ప్రజలపై,పుట్టబోయే బిడ్డపై కూడా 1 లక్ష 20 వేల అప్పు వేస్తున్నాడని ఆరోపించారు.

కేసీఆర్ గడిచిన 45 రోజులలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసి ప్రజలను తాగుబోతులను చేస్తున్నాడని,కవిత అక్రమ సంపాదన ఫార్మహౌజ్ లను మొత్తం బయట పెట్టె ప్రయత్నం చేస్తే దాడులకి దిగడం సిగ్గుచేటన్నారు.ఇంతవరకు కేసీఆర్ కాబినెట్ లో దళితులలో మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని,ఇప్పుడు దళితులపై ప్రేమను ఓలకపోయడం దౌర్బాగ్యం అన్నారు.

రాష్ట్రన్ని మొత్తం తాగుబోతులని చేస్తున్నాడని,సెక్రటరీయట్ కి అంబేద్కర్ పేరు పెట్టడం కాదు దళితుడిని ముఖ్యమంత్రిని చేసి నువ్వు ఇచ్చిన హామీని నిరవేరిస్తేనే దళితులకి న్యాయం చేసిన వాడివి అవుతావని అన్నారు.భారత రాజ్యాంగం ప్రకారం ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ లు చేసి పోలీస్ స్టేషన్ లలో నిర్భందించడం ఏంటిని,మమల్ని జైల్లో పెట్టినా కూడా కల్వకుంట్ల కుటుంబం చేసిన అక్రమాలను ప్రజలకి వివరించే వరకు ఊరుకునే సమస్యే లేదన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube