ఎస్ఈలతో ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్ల రిపేర్లు మరియు హ్యామ్ రోడ్ల ఎంపికపై ఎస్ఈలతో శుక్రవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.గత వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు,పార్ట్ హోల్ ఫీలింగ్ మెకానైజ్డ్ మిషనరీ వాడి వేగంగా గుంతలు పూడ్చేలా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.

 R And B Minister Komatireddy Venkatareddy Video Conference With Se, R And B Mini-TeluguStop.com

హ్యామ్ రోడ్ల ఎంపికలో ప్రభుత్వం ఎంపిక చేసిన కన్సల్టెన్సీతో పాటు జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని రోడ్లను ఎంపిక చేయండని సూచించారు.తీవ్రంగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు కారణం అవుతున్న రహదాలను మాత్రమే హ్యామ్ లో ఎంపిక చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల రహదారులకు ప్రాధాన్యం ఇవ్వండని తెలిపారు.గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రహదారులకు రిపేర్లు జరగకపోవడం వల్ల ఇప్పుడు అనేక రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube