నల్లగొండ జిల్లా: నల్లగొండ రూరల్ మండలం చందనపల్లి గ్రామంలోని డంప్ యార్డ్ పక్కన చెట్ల పొదల్లో చిరుత మృతదేహం కలకలం రేపింది.బుధవారం చిరుత మృతదేహాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
గత కొంత కాలంగా మండలంలోని కేశరాజుపల్లి,శేషమ్మగూడెం,ఎస్టీ కాలనీ,చందనపల్లి గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గతంలో ఆనవాళ్లు కనిపించాయి.ఇప్పుడు డంపింగ్ యార్డ్ పక్కన చెట్ల పొదల్లో చనిపోయి కనిపించింది.
అయితే వారం పది రోజుల క్రితం ఊర పందిని తిని చిరుత చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.