డీలర్లు రేషన్ బియ్యం కొంటే డీలర్షిప్ రద్దు...!

నల్లగొండ జిల్లా:ఇకపై రేషన్ దుకాణాల నుండి బియ్యం పక్కదారి పట్టినా,కార్డుదారుల నుండి బియ్యం కొనుగోలు చేసినా డీలర్షిప్ రద్దు చేసి, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని,అలాగే లబ్ధిదారులు కూడా రేషన్ బియ్యం తప్పకుండా తీసుకెళ్ళాలని,బియ్యం అమ్మినట్లు తెలిస్తే రేషన్ కార్డు రద్దు చేస్తామని జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు హెచ్చరించారు.శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వి.

 Dealership Canceled If Dealers Buy Ration Rice , Ration Rice, V. Venkateswarlu,-TeluguStop.com

వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నల్లగొండ ఎన్ఫోర్స్ మెంట్ టీమ్ మరియు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీం అధ్వర్యంలో ఐదు బృందాలుగా ఏర్పడి దాదాపు 40 ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీలర్లు అందరూ విధిగా రేషన్ దుకాణాలు టైం ప్రకారం నిర్వహించి,కార్డు దారులకు రేషన్ సప్లై చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ టీమ్ దీపక్,జావిద్, శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై టాస్క్ఫోర్స్ టీం అంజయ్య, చారి,పుల్లయ్య,పాషా పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube