డీలర్లు రేషన్ బియ్యం కొంటే డీలర్షిప్ రద్దు…!

నల్లగొండ జిల్లా:ఇకపై రేషన్ దుకాణాల నుండి బియ్యం పక్కదారి పట్టినా,కార్డుదారుల నుండి బియ్యం కొనుగోలు చేసినా డీలర్షిప్ రద్దు చేసి, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని,అలాగే లబ్ధిదారులు కూడా రేషన్ బియ్యం తప్పకుండా తీసుకెళ్ళాలని,బియ్యం అమ్మినట్లు తెలిస్తే రేషన్ కార్డు రద్దు చేస్తామని జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు హెచ్చరించారు.

శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వి.వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నల్లగొండ ఎన్ఫోర్స్ మెంట్ టీమ్ మరియు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీం అధ్వర్యంలో ఐదు బృందాలుగా ఏర్పడి దాదాపు 40 ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీలర్లు అందరూ విధిగా రేషన్ దుకాణాలు టైం ప్రకారం నిర్వహించి,కార్డు దారులకు రేషన్ సప్లై చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ టీమ్ దీపక్,జావిద్, శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై టాస్క్ఫోర్స్ టీం అంజయ్య, చారి,పుల్లయ్య,పాషా పాల్గొన్నారు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జోర్దార్ సుజాత..ఇంత సీక్రెట్ గా ఉంచారే?