దేశభక్తులకు,దేశాభిమానులకు నేతాజీ బహిరంగ పిలుపు

నల్లగొండ జిల్లా:ప్రజాభ్యుదయవాది,వర్గ దోపిడి గుండెల మీద విలుకాడు,విన్యాసి,శ్రామికవర్గ పోరాటయోధుడు బోరన్నగారి సుభాష్ చంద్రబోస్ నేతాజీ పంపుతున్న ఈ ప్రకటనను చదవండి, చదివించండి,అన్ని సోషల్ మీడియా గ్రూప్స్ లోకి పంపించండి.బోరన్నగారి 9848540078 అమృతానందాలు!ఎగరేయండి! ఎగరేయండి! ఇంటింటిపై జెండా ఎగరేయండి!”దేశమంటే మట్టికాదోయ్!దేశమంటే మనుషులోయ్!” ఈ రెండు లైన్లు జెండా దిమ్మ నుదిటిపై కొత్తగా రాయించండి.

 Netaji's Open Call To Patriots And Patriots-TeluguStop.com

కాకుంటే నాదో కండిషన్ మేకిన్ ఇండియా కాదు,రంగుడబ్బా మేడ్ ఇన్ ఇండియా కావాలి.జెండాకు కట్టే దారం నైలాన్ వద్దు స్వదేశీ జూట్ మిల్లు తయారీ తేవాలి.

జెండాలోకి గుప్పెడు పూలు కావాలి.ప్లాస్టిక్ పూల విషం వెదజల్లొద్దు.

నీ చేతితో పెంచిన గులాబీ మొక్కలవో,వీధిలో మీ చేతుల్తో పాదు చేసి నీళ్లు పోసి పెంచిన తురాయి పువ్వులో అయి ఉండాలి.ఎగరేయండి! ఎగరేయండి! ప్రతి ఇంటా ఓ జెండా ఎగరేయండి!ఏ అప్పులూ లేని మీ సొంత ఇంటిపై మాత్రమే సగర్వంగా జెండా ఎగరేయండి.

ఇళ్ళు లేనోళ్లంతా ఇళ్లు కావాలని మీ మెడలో ఒక బోర్డు తగిలించుకొని ఎగరేయండి! జెండా ఎగరేయండి!కౌలు భూములు కానీ,తాకట్టులో లేని మీ సొంత పొలంగట్లపై కూడా ఎగరేయండి! ఒక్కసెంటైనా భూమి లేని వాళ్లంతా గుంపులు గుంపులుగా వెళ్లి ఊరికి ఉత్తరాన స్మశానంలో ఎగరేయండి.దింపుడు కల్లంలో నిలబడి 75 ప్రదక్షిణలు చేయండి.

దేశమంటే మట్టికాదోయ్! అంటూ జెండాకు సెల్యూట్ చేయండి.దేశమంటే మనుషులోయ్! అంటూ గురజాడ గీతాన్ని బిగ్గరగా ఆలపించండి.

జెండా గాల్లో ఎగిరితేనే సరిపోదు మిత్రమా!గుండెల్లో కూడా ఎగరాలి.ఎగరేయండి! జెండా ఎగరేయండి!ఉసూరుమంటున్న ఐడిపిఎల్ మొండి గోడలపై ఎగరేయండి.

పనిలోపనిగా పాడుబడ్డ ప్రభుత్వ విద్యాలయాలపై,ప్రభుత్వ హాస్పిటల్స్ పై మొలచిన మర్రి చెట్టుక్కూడా ఒక జెండా కట్టండి.మర్చిపోకండి సార్లూ మీ కాన్వాయ్ ఆ దారిన పోయేటప్పుడు ఒక్కసారి తలెత్తి చూడండి.

రంగు లేక వెలవెల బోతున్న బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ పై కూడా రంగుల జెండా ఎగరేయండి.ప్రజలారా!మీ రక్తం చెమటలతో నిర్మించుకున్న రైల్వేస్టేషన్లలో బస్టేషన్లలో రోడ్ల పొడవునా రైలు పట్టాలకటూ ఇటూ రక్షణ జెండాలు ఎగరేయండి!ఆదానీకి కట్టబెట్టాలనుకున్న దామోదరం సంజీవయ్య ధర్మల్ విధ్యుత్ ప్లాంట్ పైనా పెద్ద జెండా ఎగరేయండి.

వందేళ్ల సంబురాలదాకా బతకనిస్తరో లేదో ఇంటింటా ప్రతిజ్ఞ చేసి రక్షించుకుంటామని వందల జెండాలు ఎగరేయండి!విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ముందు ఉక్కు సంకల్ప జెండా ఎగరేయండి! నవరత్నాలను కాపాడుకుంటామని 9 అడుగుల పోరాట జెండాలెగరేయండి!అమ్ముడుపోని ధాన్యపు రాశుల ముందు రైతు తలపాగా జెండాగా ఎగరేయండి.ఆ నిరసన జెండాలో నవధాన్యాలూ మూటగట్టి ఎగరేయండి.

మరోవందేళ్లు విత్తనాల్ని కాపాడుకుంటామని ఎగరేయండి!జెండా ఎగరేయండి! నదులమీదా సముద్రతీరాల పొడవునా అడవిలో చెట్టు చెట్టుపై ఎగరేయండి!రేపటికి ఏవి మిగులుతాయో ఏవి కనుమరుగవుతాయో.ప్రతి చెట్టుకి కాపలాగా పెట్టండి జెండాకర్రను ఎగరేయండి!జెండాను ఎగరేయండి! అన్నింటికన్నా దేశభక్తితో అగ్నివీరుల ఆధునిక చేతులతో ఆకాశమంత ఎత్తు జెండాలు దేశ సరిహద్దుల పొడవునా ఎగరేయండి!ఎగరేయండి జెండా ఎగరేయండి కనిపించకుండా పోయిన చెరువుల జ్ఞాపకార్థం స్మారక స్తూపాలు కట్టి వాటి పలకలపై ‘ఇక్కడ ఒక ఆకుపచ్చని సమాజం ఉండేది’అని రాసి పక్కనే ఒక జెండా ఎగరేయండి!మర్చిపోకండి మిత్రమా! మర్చిపోకండి.

బలవన్మరణానికి బలైన లక్షల రైతులను మనసునిండా స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం మర్చిపోకండి.ఎగరేయండి జెండా ఎగరేయండి మూతబడ్డ ప్రతి స్వదేశీ ఫ్యాక్టరీ పొగ గొట్టాన్నీ వెతికి తెచ్చి పేరు పేరునా సంతాపజెండా ఎగరేయండి.

ఉపాధి కోల్పోయిన కార్మికులంతా ఒక నిమిషం నిశ్శబ్దంగా ఎగిరే జెండా ముందు నిలబడండి చాలు బహుళజాతి బూట్లచప్పుడు వినిపిస్తుంది.ఎగరేయండి! ఎగరేయండి!ఇప్పుడే ఎగరేయండి! రేపటి రోజున ఏదేశంలోనైనా ఎగరవేయడానికి జెండా దిమ్మెలు ఇళ్ళూ వాకిళ్ళు స్కూళ్ళు సినిమాహాళ్లు శిథిలాలుగా మారచ్చు ఉక్రెయిన్ లా సామ్రాజ్యవాదుల యుద్ధాల భీభత్సాన్ని తలుచుకుని మీ పిల్లలతో ఎగరేయించండి.ఎగరేయండి! జెండా ఎగరేయండి! నూరేళ్ల పండుగ నాటికి ఎగరరేయడానికి మీ చేతిలో తాడూ మీటరు జెండాగుడ్డనూ కొనలేకపోవచ్చు ఇప్పుడే ఎగరేయండి!ఎగరేయండి!పది అడుగులు ఎత్తులో ఎగిరే జెండాను డాలరు ఎనభైకి దిగిన రూపాయి సంకేతంగా ఎనిమిదడుగులు అవనతం చేయండి!అపుడు మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ,నాకైతే తల తెగి నేలపై పడ్డట్టనిపిస్తుంది.“జెండా అంటే”మూడడుగుల గుడ్డముక్క కాదని తరతరాల ఆత్మగౌరవమనిపిస్తుంది.దేశమంటే మట్టికాదని దేశమంటే మనుషులనీ తెలుస్తుంది.నాకు రక్తమివ్వండి,మీకు స్వతంత్ర్యమిస్తాను అని బలిదానాలకు ఊపిరి పోసిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మాటలను అరుస్తూ జెండా ఎగరెయ్యండి.

దేశ స్వాతంత్ర్యం కోసం రక్తం చిందించడం కాదు కదా,బ్రిటిష్ సైన్యంలోకి భారత యువతను రిక్రూట్ చేసిన వారి వారసుల చెవుల తుప్పు వదిలేలా బిగ్గరగా అరవండి.అంధ భక్తుల కళ్ళు తెరిపిస్తూ జెండా ఎగరేయండి.

అవినీతి,జాతి మూలలాలను నాశనం చేస్తుందని నేతాజీ హెచ్చరికను,అవినీతితో, అవినీతి సొమ్ముతో అందలమెక్కిన పాలకులు అదిరిపోయేలా గర్జిస్తూ జెండా ఎగరేయండి.ఉద్యమాభివందనాలతో ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రకటనను దేశభక్తులకు కమ్యూనిస్టు పార్టీ కన్వీనర్ (సిపిఐ ఎంఎల్) ప్రజా నేస్తం కామ్రేడ్ బోరన్న గారి సుభాషన్న 9848540078 పంపించడం జరిగింది.

దేశాభిమానిగా మీరు సామాజిక బాధ్యతగా బోరన్నగారు మీకు పంపించిన ఈ ప్రకటనను మీరు అన్ని సోషల్ మీడియా గ్రూపులలోకి భారతీయ జనతా రాజ్యాధికారం ప్రెసిడెంట్ బిజెఆర్ సర్దార్ పటేల్ మరియు బలహీన వర్గాల రాజ్యాధికారం బివిఆర్ చైర్మన్ బివిఆర్ మహాత్మా గాంధీజీ మరియు భారతీయ శ్రామిక్ దళ్ కోఆర్డినేటర్ బి సుప్రజా రాణి ఝాన్సీ మహాలక్ష్మి భాయ్ ఈ ప్రకటనను మీకు పంపించడం జరుగుతుంది.సామాజిక బాధ్యతగా మీరు మీ దగ్గర ఉన్న అన్ని సోషల్ మీడియా గ్రూపులోకి పంపగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube