నల్లగొండ జిల్లా: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఇచ్చిన రేషన్ కార్డు మినహా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై స్పష్టత ఇవ్వని కారణంగా అనేక మంది నష్టపోతున్నారు.ఉప ఎన్నికలు సమయంలో ఓట్ల కోసం కొన్ని మార్పులు చేర్పులు చేశారు తప్ప,కేసీఅర్ ప్రభుత్వం పూర్తిగా కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు.
పాత కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తారా అంటే అది కూడా లేక అనేక మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులుగా మిగిలిపోతున్నారు.ప్రతి దానికి రేషన్ కార్డు ప్రాధాన్యత కావడంతో సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటేరేషన్ కార్డు( Ration card ) లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
మీ సేవా కేంద్రాలలో 2001 ఆగస్టు నుండి కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఆప్షన్ పూర్తిగా తొలగించారు.
అప్పటి నుండి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
ఉమ్మడి కుటుంబాల నుండి వేరుపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకుదరఖాస్తు చేయాలంటే రేషన్ కార్డు తప్పనిసరి చేశారు.
అసలు ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇలాంటి కొర్రీలు పెడితే అవి సంక్షేమ పథకాలా( Welfare schemes ) లేక ప్రజలను సంక్షోభంలో పెట్టే పథకాలాఅని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.ఆహార భద్రత (రేషన్) కార్డులలో పేర్లు సులభంగా తొలగిస్తున్న ప్రభుత్వం కొత్త చేర్చే ప్రక్రియను అందుబాటులోకి తేవకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఈ పదేళ్లలో అనేక మందికి వివాహాలు జరిగి పిల్లలు కూడా అయ్యారు.పుట్టిన పిల్లలకే పదేళ్లు వచ్చినా ఇంకా రేషన్ కార్డులో పేరు నమోదు కాక వారిని స్కూల్స్ లో చేర్పించే క్రమంలో అవస్థలు పడుతున్నారు.
కొత్త రేషన్ కార్డు వస్తుందని పెళ్లి కాగానే కొందరు యువకులు స్వచ్ఛందంగా పేర్లు తొలగింపు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.పేర్లు తొలగించినంత ఈజీగా కొత్త కార్డులలో పేర్లు చేర్చడం లేదు.
రేషన్ కార్డులో పేర్లు నమోదు కోసం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసి ఏళ్ళు గడుస్తున్నా అడుగు కూడా ముందుకు పడడం లేదు.దీనితో ప్రభుత్వ పథకాలు, పిల్లల విద్యా అవకాశాల విషయంలో అనేక మందికి అన్యాయం జరుగుతుంది.
*రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నా అతీగతీ లేదని మునగాలకు చెందిన తాటికొండ సురేష్ అన్నారు.నాకు పెళ్లి అయ్యింది,పిల్లలు పుట్టారు.కానీ,ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుందామంటే రేషన్ కార్డు కావాలని అంటున్నరు.
దేనికి దరఖాస్తు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది.ఇంకా ఎంత కాలం ఇలా ఎదురు చూడాలి?ఇకనైనా ప్రభుత్వం స్పందించి నూతన రేషన్ కార్డులకు లాగిన్ ఓపెన్ చేయాలి.లేకుంటే ఇక దశాబ్దకాలపు జనరేష్ ఇబ్బంది పడాల్సి వస్తుంది.రేషన్ కార్డులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ(Anjad Ali ) అన్నారు.
గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వితంతువులకు అంత్యోదయ కార్డులు జారీ చేసింది.ఆ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది.పేదవారికి ఇస్తున్న అన్నపూర్ణ పథకం కూడా పూర్తిగా నిలిపివేశారు.సంక్షేమ పథకాలకు పొందాలంటే ఆహార భద్రతా కార్డు ముఖ్య భూమిక పోషిస్తుంది.
ఇలాంటి రేషన్ కార్డులు 10ఏళ్ల నుండి జారీ చేయకపోవడం వల్ల అనేకమంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.