నాలుగు రోజుల పాటు తెలంగాణలో చల్లదనం

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రజలకు వాతా వరణశాఖ( Department of Meteorology ) చల్లని కబురు చెప్పింది.నేటి నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

 Cold In Telangana For Four Days, Telangana Weather , Department Of Meteorology-TeluguStop.com

పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది.ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి,మేడ్చల్‌,మల్కాజ్ గిరి,మంచిర్యాల,నిర్మల్‌, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి,జయశంకర్‌ భూపాలపల్లి,ములుగు, కామారెడ్డి,మెదక్‌ జిల్లాతో పాటు సంగారెడ్డి,ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నల్గొండ,వికారాబాద్‌,జోగులాంబ గద్వాల,వనపర్తి,నాగర్‌ కర్నూల్‌,నారాయణపేట జిల్లాల్లో కురుస్తాయని తెలిపింది.

మహారాష్ట్ర ( Maharashtra )నుంచి కర్ణాటక వీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube