చిన్న పిల్లలు మాట్లాడే మాటలు చాలా ముద్దుగా ఉంటాయి.అందుకే వారి చేత ఎక్కువగా మాట్లాడించడానికి తల్లిదండ్రులు, బంధువులు ట్రై చేస్తుంటారు.
తాజాగా తమ కూతురిని ఇలానే మాట్లాడించేలా చేశారు ఓ దంపతులు.ఆమెను ఒక ప్రశ్న అడుగుతూ ఆట పట్టించారు.
ఆ సమయంలో చిన్నారి రియాక్ట్ అయిన తీరు, చెప్పిన మాటలు చాలామంది హృదయాలను దోచేశాయి.ఆన్‌లైన్ యూజర్లను మంత్రముగ్ధులను చేసే ఆ చిన్నారి వీడియో తాజాగా వైరల్ గా మారింది.
తల్లిదండ్రులతో( parents ) ఈ చిన్నారి ఇంట్రాక్ట్ అయిన విధానం హార్ట్ టచింగ్‌గా ఉంది.ఈ వీడియోలో కుక్క ఆహారాన్ని ముట్టుకున్నావా అని కూతురిని తల్లి ప్రశ్నించడం మనం వినవచ్చు.ఈ వీడియోలో ఆమె తల్లి, తండ్రి పదేపదే ఒకే ప్రశ్న వేస్తున్నా, ఆ అమ్మాయి పెంపుడు జంతువు ఫుడ్ ముట్టుకోలేదంటే ముట్టుకోలేదని కరాకండిగా చెప్పేసింది.వీడియో అంతటా ఈ పిల్ల ముఖ కవళికలు, ఆమె అమాయకంగా మాట్లాడే ‘బేబీ టాక్’ ( Baby Talk )చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
వయస్సులో చిన్నదైనా ఈ బుడ్డ అమ్మాయి అచంచలమైన వైఖరి, దృఢమైన ప్రతిస్పందనలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఆమె బోల్డ్‌నెస్‌కి, తడబడకుండా ఒకే మాటకు కట్టుబడి ఉన్న ఈ చిన్నారి తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఈ వీడియోని చూసి చాలా మంది వ్యక్తులు ఆ అమ్మాయి ఒకే మాట నిలకడగా చెప్పడం విని ఆశ్చర్యపోయారు.ఈ చిన్నారి తన మాటలతో ప్రతి ఒక్కరూ అంగీకరించేలా చేయగల నైపుణ్యాలను ఆల్రెడీ సాధించిందని, ఈమెను చదివించడం మంచిదే అని మరికొందరు సరదాగా పేర్కొన్నారు.యూట్యూబ్ ఛానెల్ RM వీడియోస్ షేర్ చేసిన ఈ క్లిప్‌ను ఈ లింకు https://youtu.be/vIBAMDfMDMcపై క్లిక్ చేసి చూడవచ్చు.