ఈటెలపై దాడిని ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం

సూర్యాపేట జిల్లా:ఈటెల రాజేందర్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని ఖండిస్తూ కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్ వద్ద బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్,రాష్ట్ర నాయకులు బొలిశెట్టి కృష్ణయ్యలు మాట్లాడుతూ మునుగోడులో ఓడిపోతామనే భయంతో టిఆర్ఎస్ నాయకులు దౌర్జన్యలకు పాల్పడుతున్నారన్నారు.

 An Effigy Is Burned In Condemnation Of The Attack On Spears-TeluguStop.com

ఓటర్లను ప్రలోభపెట్టాలని ఎంత డబ్బు,మద్యం వంటివి పంచినా మునుగోడు ప్రజలు తమకు ఓటు వేయరని అర్థమై అసహనముతో టిఆర్ఎస్ గుండాలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారన్నారు.

ఉద్యమకారుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు యాదా రమేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు సాతులూరి హనుమంతరావు,బిజెపి ఆర్టీఐ ఆర్టిఏ సెల్ జిల్లా కన్వీనర్ కొండ్లే రవికుమార్,మునగాల మండల అధ్యక్షులు భద్రంరాజు కృష్ణప్రసాద్,నడిగూడెం మండల అధ్యక్షులు దున్న సతీష్,కోదాడ పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి వెంకటేష్,పట్టణ ఉపాధ్యక్షులు చల్లా వెంకటకృష్ణ,గడ్డం మహేశ్వరి,పోల సురేష్, పట్టణ కోశాధికారి పైడిమర్రి సతీష్ కుమార్,యువమోర్చా కోదాడ పట్టణ అధ్యక్షుడు ఏపూరి గణేష్,మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు కోటకొమ్ముల భాగ్యమ్మ,కోదాడ పట్టణ వాణిజ్య సెల్ అధ్యక్షుడు చండూరు నాగమల్లేశ్వరరావు,పెనుగొండ శ్రీనివాసరావు, షైక్ లతీఫ్,మల్సూర్,రౌతు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube