బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు.నేడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కాగా షారుఖ్ ఖాన్ నటిస్తున్న పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
చిన్న వయస్సులోనే షారుఖ్ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు.కెరీర్ తొలినాళ్లలో రొమాంటిక్ సినిమాలలో నటించిన షారుఖ్ ఖాన్ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
పది రూపాయలతో ముంబై మహా నగరంలో జీవనం సాగించానని షారుఖ్ ఖాన్ వెల్లడించారు.షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ 10,000 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది.
బాలీవుడ్ లోని సంపన్నవంతులైన హీరోలలో షారుఖ్ కూడా ఒకరు కావడం గమనార్హం.షారుఖ్ ఖాన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కొత్త తరహా కథాంశంతో తెరకెక్కనుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.
షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పఠాన్ టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్న వాళ్లలో షారుఖ్ ఖాన్ ఒకరు కావడం గమనార్హం.టీవీ స్టార్ నుంచి షారుఖ్ ఖాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.ఇలా టీవీ రంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.

షారుఖ్ ఖాన్ గత సినిమాలు ఫ్లాపైన నేపథ్యంలో ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.షారుఖ్ ఖాన్ జయాపజయాలతో సంబంధం లేకుండా మార్కెట్ ను పెంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.షారుఖ్ ఖాన్ మల్టీస్టారర్ సినిమాలలో కూడా నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.