నల్లగొండ జిల్లా:గాలికి,వానకు వణుకుతున్న విద్యుత్ తీగలు.విద్యుత్ తీగలా?ప్రజల పాలిట యమపాశాలా?విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం,విషాదం పాలవుతున్న బాధిత కుటుంబాలు.ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలకు ఇంకెంత మంది బలి కావాలి?పాలకులను లేఖ ద్వారా నిలదీసిన ప్రజానేస్తం బోరన్న.మృత్యు పాశాలుగా మారుతున్న విద్యుత్ తీగల ప్రమాదాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బోర సుభాషన్న బహిరంగ లేఖ.వానకాలం వచ్చిందంటే తొలకరితో మురిసిపోయే తెలుగు రాష్ట్రాల ప్రజలు కరెంటు అధికారుల నిర్లక్ష్యం వల్ల గాలికి వానకు విద్యుత్ తీగలు వణుకుతున్నాయని తద్వారా ప్రజలు భయం భయంగా బ్రతుకుతున్నారని ప్రజాబంధు అవార్డు గ్రహీత,కమ్యూనిస్టు పార్టీ సిపిఐ(ఎం-ఎల్) రాష్ట్ర కార్యదర్శి,కామ్రేడ్ బోర సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏటా వందలాది మంది అన్యాయంగా మృత్యు పాలవుతున్నారని బోరన్న కన్నీరు పెట్టారు.
వాన కాలానికి ముందే కరెంటు నెట్వర్క్ సన్నద్ధతపై ప్రణాళికలు రూపొందించాలని,కానీ,క్షేత్రస్థాయిలో ఆ పని జరగడం లేదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బోరన్న రాసిన లేఖలో పేర్కొన్నారు.వర్షాలు పడక ముందే కరెంటు లైన్లలోని ఇన్సులేటర్ లు పరిశీలించి పగిలి పోయిన వాటిని మార్చాల్సి ఉండగా,సరైన తనిఖీలు చేయడం లేదని బోరన్న తెలిపారు.
వదులుగా ఉన్న లైన్లను పాతవాటిని మార్చాల్సి ఉండగా నిధులను బట్టి ప్రాధాన్య క్రమంలో చేస్తుండడంతో చిన్నచిన్న గాలివానలకు లైన్లు తెగి పడుతున్నాయని ప్రజా బంధువు బోర సుభాషన్న 9848540078 ఆరోపించారు.విద్యుత్ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజా నేస్తం బోరన్న 8328277285 /9848540078 తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తూతూ మంత్రంగా ముందస్తు నిర్వహణ ఉందని,లైన్ల పరిశీలనే లేదని బోరన్న పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాలలో చాలాచోట్ల ఇండ్లపై యమ పాశాలుగా విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని బోరన్న తెలిపారు.
కొన్నిచోట్ల ఇండ్ల పైనుంచి విద్యుత్ తీగలు వెళుతున్నాయని పొరపాటున విద్యుత్ తీగలు తగిలితే ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతాయని బోర సుభాషన్న పేర్కొన్నారు.వాన కాలంలో విద్యుత్ ప్రమాదాలు మరింతగా జరిగే అవకాశాలు ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సిపిఐ (ఎం-ఎల్) రాష్ట్ర కార్యదర్శి బోర సుభాషన్న 9848540078 కోరారు.
యమ పాశాలుగా మారిన విద్యుత్ తీగల నుండి ప్రజలను,మూగ జీవులను కాపాడాలని, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రతిక్షణం ప్రజాహితాన్ని కోరే ప్రజా నేస్తం కామ్రేడ్ బోర సుభాషన్న ముఖ్యమంత్రులను డిమాండ్ చేశారు.విద్యుత్ హై టెన్షన్ లైన్లు చాలా ప్రాంతాల్లో ప్రజలను వణుకు పెట్టిస్తున్నాయని,కరెంటు తీగల రూపంలో ఎప్పుడు ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక ప్రజలు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారని బహుజన హితాన్ని కాంక్షించే బోర సుభాషన్న బాధపడ్డారు.
హైటెన్షన్ తీగల లైన్లను ప్రజలకు నష్టం జరగని ప్రత్యామ్నాయ ప్రదేశాలకు మార్చాలని,అన్ని రకాల విద్యుత్ ప్రమాదాలపై ప్రజలలో చైతన్యం తేవాలని కోరారు.తెగి పడుతున్న విద్యుత్ వైర్లను తక్షణమే సరిచేయాలని మృత్యు తీగలుగా మారిన విద్యుత్ తీగలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సిపిఐ (ఎం-ఎల్) రాష్ట్ర కార్యదర్శి బోర సుభాష్ చంద్రబోస్ నేతాజీ డిమాండ్ చేశారు.