పెద్దవూర బ్రిడ్జికి రెండేళ్లు అయినా మోక్షం లేదా...?

నల్లగొండ జిల్లా: పెద్దవూర మండలం కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి రెండేళ్లైనా పూర్తి కాకుండా నత్త నడకన నడుస్తూ ఉండడంతో వాహనదారులు, వ్యాపారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.అయితే కొద్ది రోజుల క్రితం వన్ సైడ్ బ్రిడ్జి కంప్లీట్ కావడంతో బ్రిడ్జిపై వన్ వే లో వాహనాలను పంపిస్తున్నారు.

 Even After Two Years Peddavoora Bridge Is Not Saved, Peddavoora Bridge , Nalgond-TeluguStop.com

ఈ క్రమంలో బ్రిడ్జికి అనుసంధానమైన రోడ్డు 40 మీటర్ల మేర గుంతలు ఏర్పడ్డాయి.కనీసం ఆ గుంతలను పూడ్చి వేయడం గానీ,దుమ్ము ధూళి లేవకుండా నీటిని కొట్టడం గానీ చేయక పోవడంతో వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు.

ఈ రహదారి గుండానే నాగార్జున సాగర్ పర్యాటక కేంద్రానికి నిత్యం వచ్చి పోయే వాహనాలు రద్దీ ఉంటుందని, కనీసం కాంట్రాక్టర్,అధికారులు బ్రిడ్జి సమీపంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని,వాహనదారులు తికమక అవుతూ గుంతల రోడ్డులో వచ్చే వాహనాలను తప్పించే ప్రయత్నంలో కిందపడి గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుంతలను పూడ్చకూడా ఉండడంతో వాహనాల తాకిడికి లేచే దుమ్ము,దూళితో వ్యాపార సముదాయాలు నిండిపోతున్నాయని,ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా వర్షం పడితే బ్రిడ్జిపై మోకాళ్ళ లోతు నీరు నిలవడంతో పాదచారులు బ్రిడ్జిపై బురద నీటిలో నుండి వెళ్లాల్సి వస్తుందని,వెళ్లే క్రమంలో పక్కనుండి వాహనం వెళితే బురద నీరు చిమ్మి మీద పడుతున్నాయని ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలను పూడ్చివేసి, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి,బ్రిడ్జిపై నీరు నిలవకుండా రోడ్డుకు మరమ్మతులు చేసి, వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube