బలిసినోడికి బలం బీఆర్ఎస్-పేదోనికి బాసట కాంగ్రెస్:మాజీ సిఎల్పీ నేత జానారెడ్డి

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.గులాబీ పార్టీ నేతలు ఎమ్మెల్యే తీరుతో విసుగుచెంది తిరిగి మాతృ సంస్థ హస్తం గూటికి చేరుతున్నారు.

 Nagarjuna Sagar Constituency Brs Leaders Joins Congress Party Under The Leadersh-TeluguStop.com

తెలంగాణ రాజకీయాల్లో తలపండిన మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తన తనయుడు కోసం తన అనుభవాన్ని మొత్తం రంగరించి పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శతవిధాలా శ్రమిస్తున్నారు.

దానికి తగిన ఫలితం కూడా కనిపిస్తుంది.

సోమవారం నల్లగొండ జిల్లా అనుమల మండలం హాలియా మార్కెట్ మాజీ చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి (బాబాయ్) జానారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.పెద్దవూర మండలంలోని చింతపల్లి సర్పంచ్ సంజీవ్,బసిరెడ్డిపల్లి సర్పంచ్ నరాల కొండయ్య, ఉపసర్పంచులు,20మంది వార్డ్ నెంబర్లు,నాయకులు, కార్యకర్తలు సుమారు 1200 మంది జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గుర్రంపొడు మండలం నుండి 2,500 మంది,నిడమనూరు మండలం నుండి 2,000 మంది రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జానారెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube