పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు వదిలేయాలి అంటూ ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయాలలో ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabha Reddy ) వ్యవహారం రోజు రోజుకి చర్చనీయాంశంగా మారుతుంది.ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఎన్నికల ముందు కామెంట్లు చేశారు.

 Mudragada Sensational Comments Saying That Pawan Kalyan Should Not Do Films , Mu-TeluguStop.com

కాగా ఎన్నికలలో జనసేన పార్టీ( Janasena party ) పోటీ చేసిన అన్ని పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానాలలో గెలవడం జరిగింది.పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ 70 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

దీంతో ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలవడంతో.చేసిన కామెంట్ల ప్రకారం తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ ఇక నుండి పూర్తిగా సినిమాలు వదిలేయాలని సూచించారు.

ఎన్టీఆర్ ( NTR )ముఖ్యమంత్రి అయ్యాక సినిమాల్లో నటించడం పూర్తిగా మానేశారు.చట్టం ఒప్పుకోకపోవడం వల్ల అలా చేశారేమో తెలీదు.

మధ్యలో ఓ సినిమాలో నటించాల్సి వస్తే కేంద్రం నుంచో సుప్రీంకోర్టు నుంచో అనుమతి తీసుకున్నారు.మీరు కూడా ఎన్టీఆర్ తరహాలోనే సినిమాలు మానేసి ప్రజాసేవకు మీ జీవితాన్ని అంకితం చేయండి అని ముద్రగడ పద్మనాభం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) కి సూచించారు.

ఇప్పటికే పవన్ నటిస్తున్న కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.ఎన్నికలకు ముందే ఈ సినిమాలకు సంబంధించి షూటింగులు స్టార్ట్ చేయడం జరిగింది.

అయితే ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం కావడంతో.సెట్స్ మీద ఉన్న సినిమాల విషయంలో పవన్ ఏ రకంగా వ్యవహరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube