Nayani Pavani : నయని పావని ఎలిమినేషన్.. కేసు వేయాలంటూ ప్రముఖ నటుడి సంచలన ట్వీట్ వైరల్!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss Season Seven ) నుంచి ఆరో వారం ఎలిమినేషన్స్ లో భాగంగా హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.దీంతో ఆరవ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది.

 Bigg Boss Telugu 7 Shocking Tweet By Ex Contestant Arjun Kalyan On Nayani Elimi-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఇటీవలే హోస్ట్ నాగార్జున ( Nagarjuna )అంబటి అర్జున్, నయని పావని, అశ్వినిశ్రీ, పూజా మూర్తి, భోలే షావలి హౌస్లో అడుగుపెట్టారు.అనూహ్యంగా వీరిలో ఒక వికెట్ డౌన్ అయ్యింది.

నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయ్యింది.

అమర్ దీప్, ప్రిన్స్ యావర్,తేజా, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తి, శోభా శెట్టి నామినేట్ అయ్యారు.వీరు ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు.చివరికి అశ్వినీ శ్రీ, నయని పావనిని సీక్రెట్ రూమ్ కి ఇద్దరినీ పిలిచిన నాగార్జున నయని పావని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.

దాంతో నయని పావని( Nayani Pavani ) షాక్ అయ్యింది.ఆమె ఒక్కసారిగా కూలిపోయింది.బాగా ఏడ్చేసింది.వేదిక మీద కూడా నయని పావని ఏడుస్తూనే ఉంది.

కేవం ఒక వారంలో ఎలిమినేట్ అవుతానని ఆమె ఊహించి ఉండదు.వైల్డ్ కార్డు ఎంట్రీ కావడంతో ఒకటి రెండు వారాలు ఆమెకు ఛాన్స్ ఉంటుందని భావించి ఉండవచ్చు.

ఆ సంగతి పక్కన పెడితే నయని పావని ఎలిమినేషన్ పై మాజీ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ ( Former contestant Arjun Kalyan )సంచలన ట్వీట్ వేశాడు.ఆమె ఎలిమినేషన్ వేదనకు గురి చేసిందని అన్నాడు.నయని పావని ఒక్కవారంలో ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ కాదు.ఆమె గేమ్ బాగా ఆడుతుంది.ఓటింగ్ కి ఎలిమినేషన్ కి సంబంధం లేదని ఇప్పుడు జనాలకు అర్థమైంది.ఓటింగ్ విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి.

ఎవరైనా ఈ విషయమై కేసు వేస్తే బాగుండు, అంటూ ట్వీట్ చేశాడు.అర్జున్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

నిజానికి చాలా కాలంగా బిగ్ బాస్ ఓటింగ్, ఎలిమినేషన్ మీద అనుమానాలు ఉన్నాయి.కొన్ని ఎలిమినేషన్స్ వివాదాస్పదం అయ్యాయి.

ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయం కచ్చితంగా తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube