డార్క్ చాక్లెట్.వీటిని ఇష్టపడని వారుండరు.చాక్లెట్స్ చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే.చాక్లెట్ అంటే పడి చచ్చేపోయే వారు కూడా ఉంటారు.కోకో చెట్టు నుండి తీసిన విత్తనాలతో తయారు చేసే డార్క్ చాక్లెట్స్ రుచిగా ఉండడమే కాకుండా.ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
అందుకే వారానికి రెండు, మూడు సార్లు డార్క్ చాక్లెట్ ను చిన్న మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
పని ఒత్తిడిలో ఉన్నవారు టీ, కాఫీలు తాగుతంటారు.కానీ, అలాంటి సమయంలో డార్క్ చాక్లెట్ తింటే.తక్షణ ఉపశమనం లభిస్తుంది.అలాగే డార్క్ చాక్లెట్ రక్త సరఫరాను మెరుగుపరచడంతో పాటు రక్తం గడ్డకట్టకుండా కూడా సహాయపడుతుంది.

దీంతో గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మొదడు కూడా షార్ప్‌గా పనిచేస్తుంది.ఇక డార్క్ చాక్లెట్ వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.తద్వారా కరోనా వంటి భయంకర వైరస్‌ల నుంచి రక్షణ పొందవచ్చు.
ఇక చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది కేవలం అపోహ మాత్రమే.
వాస్తవానికి చాక్లెట్లలోని టానిన్లు దంతాలను త్వరగా పాచి పట్టనీయకుండా చేస్తుంది.అలాగే రోజూ డార్క్ చాక్లెట్లను తినడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచవచ్చని మరియు శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో ఇవి సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు.