LRS Charges : ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలి:మాజీ ఎమ్మెల్యే నోముల భగత్

ప్రజల నుండి ఎలాంటి రుసుము తీసుకోకుండా ప్లాట్లను రెగ్యులైజేషన్ చేయాలని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్( Former MLA Nomula Bhagat ) డిమాండ్ చేశారు.గురువారం నల్లగొండ జిల్లా హాలియా పట్టణ ప్రధాన సెంటర్లో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లడుతూ ఎల్ఆర్ఎస్ విషయంలో మాట తప్పి ప్రజలను మోసం చేస్తుందన్నారు.

 Lrs Should Be Implemented For Free Says Former Mla Nomula Bhagat-TeluguStop.com

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, తమ పార్టీ నేతలు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించామన్నారు.అనంతరం మెయిన్ సెంటర్ నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు బైకు ర్యాలీగా వెళ్లి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా( Free LRS ) అమలు చేయాలని కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు,అన్ని పార్టీ విభాగాల సెల్స్ అద్యక్షులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube